మెటాపై అమెరికాలో కీలక విచారణ.

Advertisements

<p>మెటాపై అమెరికాలో కీలక విచారణ కొనసాగుతోంది&period; పిల్లల భద్రతకు సంబంధించిన అంశాలపై 29 రాష్ట్రాలు చేసిన ఆరోపణల నేపథ్యంలో కోర్టులో విచారణ జరుగుతోంది&period; ఫేస్‌బుక్&comma; ఇన్‌స్టాగ్రామ్‌ ప్లాట్‌ఫామ్‌లను పిల్లలను ఆకర్షించేలా డిజైన్ చేశారని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి&period; పిల్లల భద్రతకు సంబంధించిన ప్రమాదాలను మెటా దాచిందని&comma; పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడంలోనూ సంస్థ విఫలమైందని ఆరోపణలు ఉన్నాయి&period; పిల్లల భద్రత కంటే యూజర్ ఎంగేజ్‌మెంట్‌కే మెటా ప్రాధాన్యత ఇచ్చిందని సంస్థ మాజీ ఇంజినీర్ కీలక వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం&period; ఈ కేసులో మెటాకు భారీ నష్టపరిహారం ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది&period; నష్టపరిహారం 200 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి&period; అయితే మెటా అంచనా ప్రకారం నష్టం 1&period;4 ట్రిలియన్ డాలర్ల వరకు చేరే అవకాశం ఉందని సమాచారం&period; ఈ కేసులో వెలువడే తీర్పు భవిష్యత్తులో ఇతర టెక్ కంపెనీలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న 22-A వివాదం!

ప.గో.జిల్లా భీమవరంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం.

అంతరిక్ష రంగంలో అమెరికా భారీ టార్గెట్.