శ్రీరంగంపట్నంలోని ఆలయంలో ఎంట్రీ విషయంలో వివాదం.

Advertisements

<p>శ్రీరంగపట్నంలోని ఆరతి ఉక్కడ ఆలయంలో ఎమ్మెల్యే కుమార్తె&comma; పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ మధ్య ఘర్షణ సంచలనంగా మారింది&period; మహిళా పీఎస్‌ఐ&comma; ఎమ్మెల్యే కుమార్తె ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకోవడం తీవ్ర కలకలం రేపింది&period; భీమ అమావాస్య వేడుకల సందర్భంగా ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించే విషయంలో వివాదం తలెత్తింది&period; దీంతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు&period; దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది&period;<&sol;p>&NewLine;<p>ఆగస్టు 12à°¨ రాత్రి ఆరతి ఉక్కడ ఆలయానికి తుమకూరు రూరల్‌ ఎమ్మెల్యే బి&period;ఎస్‌&period;సురేశ్‌గౌడ కుమార్తె ఐశ్వర్య వెళ్లారు&period; గర్భగుడిలోకి వెంటనే అనుమతించకపోవడంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు&period; ఈ క్రమంలో మండ్య మహిళా పోలీస్‌స్టేషన్‌కు చెందిన పీఎస్‌ఐ సవితా బి&period;పాటిల్‌తో ఆమె తీవ్ర వాగ్వాదం చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది&period; వాగ్వాదం ముదరడంతో సవితా పాటిల్‌ను ఐశ్వర్య చెంపదెబ్బ కొట్టగా&period;&period; అనంతరం పీఎస్‌ఐ కూడా ఆమెను కొట్టినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది&period; అక్కడున్న పోలీసులు&comma; భక్తులు వెంటనే జోక్యం చేసుకుని ఇద్దరినీ శాంతింపజేసేందుకు ప్రయత్నించారు&period; అంతకుముందు ఐశ్వర్య ఎవరికో ఫోన్‌ చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది&period; ఈ ఘటనపై కైతనహళ్లి పోలీస్‌స్టేషన్‌లో పీఎస్‌ఐ సవితా పాటిల్‌ ఫిర్యాదు చేశారు&period; తనను దూషించడంతో పాటు చెంపదెబ్బ కొట్టి&comma; విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు&period; ఇదే ఘటనకు సంబంధించి ఐశ్వర్య తరఫున ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదని తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు ఎమ్మెల్యే సురేశ్‌గౌడ తన కుమార్తె తరఫున క్షమాపణలు చెప్పారు&period; అయితే ఆలయంలో తన కుమార్తెను పోలీసులు గర్భగుడిలోకి అనుమతించలేదని&comma; అదే సమయంలో ఓ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ను మాత్రం లోపలికి అనుమతించారని ఆయన ఆరోపించారు&period; పీఎస్‌ఐ తన కుమార్తెను దూషించినట్లు తెలిసిందని&comma; ఆ తర్వాతే ఘర్షణ చోటుచేసుకుందని తెలిపారు&period; తన కుమార్తె పోలీసు అధికారిని కొట్టిన దృశ్యాలను తాను చూడలేదని చెప్పిన ఎమ్మెల్యే&period;&period; జరిగిన ఘటనకు విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పారు&period; ఈ ఘటనపై పోలీసుల చర్యలు&comma; ఇరువర్గాల ఫిర్యాదుల వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.

అమెరికా వెళ్లే భారతీయ ఉద్యోగులకు భారీ షాక్.

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి.