కమర్షియల్ సిలిండర్ల ధర పెంచిన చమురు సంస్థలు .

Gas cylinder

Advertisements

<p>దేశంలో మరోసారి కమర్షియల్ సిలిండర్లపై భారీగా ధరలు పెరిగాయి&period; దీంతో వ్యాపార వర్గాలపై గ్యాస్ భారం మరింత ఎక్కువ అవనుంది&period; నేటి నుండి దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు మరోసారి పెంచాయి&period; ఇది చిన్న పెంపే అయినప్పటికీ&comma; గత కొన్ని నెలలుగా వరుసగా పెరుగుతున్న à°§à°°à°² నేపథ్యంలో హోటళ్లు&comma; రెస్టారెంట్లు&comma; చిన్న చిన్న ధాబాలు నడుపుకునే వ్యాపారస్తులకు ఇది అదనపు భారంగా మారింది&period; అయితే&comma; గృహ అవసరాలకు ఉపయోగించే 14&period;2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పు లేకపోవడం గృహిణులకు పెద్ద ఊరటనిచ్చే అంశం&period; ఈ తాజా పెంపు తర్వాత దేశంలోని ప్రధాన నగరాల్లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ కొత్త ధరలు ఇలా ఉన్నాయి&period; దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో సిలిండర్ à°§à°° రూ&period; 42 పెరగడంతో&comma; ఇక్కడ కొత్త à°§à°° రూ&period; 3&comma;113&period;50 కి చేరింది&period; ఇక కోల్‌కతాలో గరిష్టంగా రూ&period; 53&period;50 పెరగడంతో&comma; కొత్త à°§à°° రూ&period; 3&comma;255&period;50 గా నమోదైంది&period; ముంబైలో సుమారు రూ&period; 3&comma;024 దాటింది&period;<&sol;p>&NewLine;<p>కమర్షియల్ గ్యాస్ ధరలు గత కొన్ని నెలలుగా నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి&period; ముఖ్యంగా మే నెలలో భారీగా రూ&period; 993 వరకు పెరిగింది&period; అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో వస్తున్న హెచ్చుతగ్గులు&comma; పశ్చిమ ఆసియా ప్రాంతంలో నెలకొన్న తీవ్ర భౌగోళిక ఉద్రిక్తతలు&period; అంతర్జాతీయసప్లై చైన్ లో తలెత్తుతున్న ఇబ్బందులే ఈ à°§à°°à°² పెరుగుదలకు ప్రధాన కారణాలుగా ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నారు&period; ఈ నిరంతర పెంపు వల్ల రాబోయే రోజుల్లో హోటళ్లలో ఆహార పదార్థాల ధరలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.