కేంద్రంలో ఇండియా కూటమి 350 సీట్లతో అధికారంలోకి వస్తుందంటున్నారు తిరుపతి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్(Chinta Mohan). ప్రధాని మోదీ(Prime Minister Modi) పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. మోదీ హయాంలో అదానీ, అంబానీ లాంటి కార్పోరేట్ సంస్థలు మాత్రమే లాభపడ్డాయని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక సామాన్య ప్రజల జీవనం దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది చదవండి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ – ఇస్రో చేపట్టిన చంద్రయాన్ – 4 మిషన్…
ఎన్డీఏ కూటమి 150 సీట్లకే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. షర్మిల నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు సీట్లను కూడా కాంగ్రెస్ గెలుస్తుందంటున్నారు చింతా మోహన్.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి