ఒక మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా? అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే నమ్మలేని రోజులివి. కానీ నిన్న చనిపోయిన సీతారాం ఏచూరి నమ్మకాన్ని ఒక నిలువెత్తు నిజంగా మన కళ్ళ ముందు ఆవిష్కరించారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరి శ్వాస వరకూ అలాగే బతికారు.
విప్లవమా! అది వస్తుందో రాదో తెలియని దశలో సోవియట్ రష్యా నుంచి భారత దేశానికీ చేరడానికి ఇంకా ఎంత దూరం ప్రయాణం చేయాలో తెలియని స్థితిలో ఏచూరి కామ్రేడ్ గా మారారు పైన స్వర్గం ఒక చెదిరిన కలలా మిగిలిపోయినా అసలు చైనాలో వున్నది సోషలిస్టు వ్యవస్తేనా అనే అనుమానం పీడిస్తున్నా కూడా ఎర్ర జెండాను వదలకుండా వున్న ఏచూరిని చూసి “పొద్దు తిరుగుడు పూలు” కూడా సిగ్గుపడి తల దించుకున్నాయి.
కళ్ళ ముందే బెంగాల్ లాంటి కమ్యూనిస్ట్ కంచుకోటలు కుప్పకూలినా, చట్ట సభల్లో కామ్రేడ్లు కనుమరుగవుతున్నా ఏచూరి దారి తప్పలేదు పక్క చూపులు చూడలేదు.
చదువు సంధ్యా లేకపోతె రాజకీయాలే గతి అని అందరం అనుకుంటాం. కానీ ఏచూరి ఇందుకు పూర్తిగా భిన్నమయిన వ్యక్తి. బతుకుదెరువు కోసం అయన రాజకీయాలలోకి రాలేదు. ఆలా బతకాలి అనుకుంటే ఏచూరి రాజకీయాలలోకి రావాల్సిన పనేలేదు. అందునా కమ్యూనిస్ట్ రాజకీయాలలోకి అసలే అవసరం లేదు. ఢిల్లీ లోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ లో ఎకనామిక్స్ లో సీట్ రావడం చాలామందికి ఒక కల. ఆది దాదాపు అసాధ్యమయిన పని. అక్కడ చదివి ఐఏఎస్ అధికారి కావడమో లేకపోతె ఎదో యూనివర్సిటీ లో ఒక ప్రొఫెస్సర్ కావడమో ఏమంత కష్టమయిన పని కాదు.
కమ్యూనిస్ట్ రాజకీయాలలో ఏచూరి ఒక సిద్ధాంతకర్త (ideologue), ఆంగ్లం, తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ భాషల్లో ప్రావిణ్యం వున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. కాకపోతే అగ్నిహోత్రికుల కుటుంభం లో పుట్టి పెరిగిన ఏచూరి తన పార్టీ లో క్రీమీ లేయర్ గా, ఒక ఎలీట్ గా మిగిలిపోయారు. అందువల్ల తన టిపికల్ ఫార్మ్, ఆంగ్లిసైజెడ్ కంటెంట్ లను అధిగమించి గ్రామీణ నేపథ్యం గల మధ్యతరగతి, పేద వర్గాలకు చెందిన కింది స్థాయి కార్యకర్తలతో కనెక్ట్ కావడం తనకు సవాలుగా మారింది.
జాతీయ స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వాల కూర్పులకే ఏచూరి ప్రధానంగా పరిమితం అయ్యారు. అధికార పార్టీల కూర్పులో ఏచూరి కనపర్చిన ఈజ్ మోడీ పాలనలో అర్బన్ నక్సల్స్ గా ముద్ర వేయబడి అణచివేతకు గురయిన prof సాయిబాబా, వరవర రావు లాటి వివిధ వామపక్ష పాయలకు చెందిన అనేకమందితో కలిసి పనిచేయడం లో కొరవడింది. అలాగే 20 వ శతాబ్ది లో వెల్లువలో వచ్చిన అస్తిత్వ ఉద్యమాలతో మమేకం కాలేకపోయారు. బహుశా తన సామజిక నేపథ్యం కూడా ఇందుకు అడ్డంకి అయివుండొచ్చు.
మార్క్సిస్ట్ సిద్ధాంతం ఒక డాగ్మా లాగా మిగిలిపోకుండా నిత్యం మారుతున్న కాలానికి అనుగుణంగా సంపన్నం చేయడానికి అవసరమయిన థింక్ ట్యాంక్ ను పదిల పర్చడం ఏచూరి వారసుల ముందు నేడున్న అతి పెద్ద సవాల్.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి