జీఎస్టీ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌ను పోలీసులు 5వ నిందితుడిగా చేర్చారు. ఈ మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. పన్ను ఎగవేతదార్లకు సహకరించడంతో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయంటూ ఆ శాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వర రావు, డిప్యూటీ కమిషనర్ శివ రామప్రసాద్, ఐఐటీ హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్‌బాబు, ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా చేర్చారు.
కాగా వాణిజ్య పన్నుల శాఖలో పెద్ద ఎత్తున పన్ను ఎగవేతలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఒక్క తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ ఎగవేత ద్వారా ఏకంగా వెయ్యి కోట్లకుపైగా నష్టం జరిగినట్టు తెలుస్తోంది. జీఎస్టీ కుంభకోణంలో 5వ నిందితుడిగా మాజీ సీఎస్ సోమేశ్. మరో 11 ప్రైవేటు సంస్థలు దాదాపు రూ. 400కోట్లు పన్ను చెల్లింపులు ఎగవేసినట్టు ఆ శాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఫిర్యాదులో తెలిపారు. మరోవైపు మానవ వనరులను అందించే బిగ్‌లీప్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏమాత్రం ట్యాక్స్ కట్టకుండానే ఏకంగా 25.51కోట్ల ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ తీసుకుందని, అవకతవకలు జరిగాయని తేలిన నేపథ్యంలో అంతర్గతంగా విచారణ జరిపినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. వాణిజ్యపన్నులశాఖకు సాంకేతికతను అందించే సర్వీస్ ప్రొవైడర్‌గా ఐఐటీ హైదరాబాద్ వ్యవహరించింది. తెలంగాణలో పన్ను చెల్లింపుదారులు నమోదు చేసే ఐటీ రిటర్న్‌ల్లో అక్రమాలను గుర్తించడంతోపాటు డేటాను విశ్లేషించడం సర్వీస్ప్రొవైడర్ చేయాల్సిన పని.కానీ బిగ్‌లీప్ టెక్నాలజీస్ అక్రమాలను ఐఐటీ హైదరాబాద్ అందిస్తున్న ఐఐటీ హైదరాబాద్ స్క్రూటినీ మాడ్యూల్ కూడా గుర్తించలేకపోయిందని వివరించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- జీవో నెంబర్ 29ని రద్దు చేయాలన్న బండి సంజయ్జీవో నెంబర్ 29 వెనుక రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర దాగి ఉందని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకే మోడీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెచ్చిందన్నారు. జీవో నెంబర్…
- హరీష్ రావుకు జూపల్లి సవాల్హరీష్ రావుకు జూపల్లి సవాల్ విసిరారు . హారీష్ రావుతో తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఎల్బీ స్టేడియంకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరు వస్తారో డిసైడ్ చేసుకోండని చెప్పారు. తెలంగాణలో జరిగిన అవినీతిపై చర్చించడానికి…
- పోలీసుల అదుపులో బండి సంజయ్కేంద్రమంత్రి బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాహనంలో ఎక్కించి తరలించారు. దీంతో పోలీసుల వాహనాన్ని గ్రూప్-1 అభ్యర్థులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయినా సరే అభ్యర్థులను చెదరగొడుతూ బండి సంజయ్‌ను పోలీస్…
- కేటీఆర్, హరీశ్ రావులపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్..బీఆర్ఎస్ నేతల ఫామ్ హౌస్ డ్రైనేజీ నీటిని పేదలకు వేళ్లే తాగునీటిలో కలుపుతారా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల తాపత్రయమంతా ఫామ్‌హౌస్‌లు కాపాడుకోవడానికేనని అన్నారు. మూసీ పునరుజ్జీవం వేరు.. హైడ్రా వేరని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం…
- యాదగిరి గుట్ట లడ్డూ భేష్..యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామికి ప్రభుత్వం 60 కిలోల బంగారు తాపడం పెట్టనుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల లడ్డూలను టెస్టింగ్ కు పంపితే యాదగిరి గుట్ట లడ్డూ భేష్ అని రిపోర్ట్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి