జిల్లాలో జరగనున్న ఎన్నికల కోసం ఇంటింటికి ఓటరు స్లిప్పుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించామని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోజ్ తెలిపారు.ఓటరు స్లిప్పులతో పాటు ఓటింగ్ విధానంపై అవగాహగాన కల్పించేలా ఓటర్ గైడ్ బుక్ లెట్ ను కూడా అందజేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోజ్ తెలిపారు. 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4,119 పోలింగ్ స్టేషన్ల పరిధిలో మొత్తం 45 లక్షల వరకూ ఓటర్లు ఉన్నారని, వారందరికీ ఓటర్ స్లిప్ప్ లతో పాటు బుక్ లెట్లను కూడా అందించే కార్యక్రమాన్ని చేపట్టినట్టు రొనాల్డ్ రోజ్ తెలిపారు. ఓటరు స్లిప్పులో ఓటరు పేరు, పోలింగ్ కేంద్రం నెంబర్, బుక్ లెట్ లో ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు, ఓటింగ్ లో పాల్గొనే విధానంపై అవగాహన కల్పించేలా వివరాలు ఉంటాయని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. వీటితో పాటు ఓటర్లు మరింత అవగాహన కోసం తమ పోలింగ్ కేంద్రాల వివరాలు ఓటరు జాబితా లో పేరు ను పరిశీలన చేసుకునేందుకు eci వెబ్ సైట్ eci.gov.in లేదా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ను ఉపయోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోజ్ ఓటర్లను కోరారు.
ఇంటింటికి ఓటింగ్ స్లిప్ల్ ల పంపిణీ…
52
previous post