మంత్రి, ములుగు ఎమ్మెల్యే సీతక్క స్వగ్రామం జగ్గన్నపేట ప్రజలకు శుభవార్త. త్వరలోనే ఈ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులోకి రాబోతోంది. బస్సు నడిపేందుకు ఆ రూట్‌ను ఆర్టీసీ బుధవారం పరిశీలించింది. వరంగల్-2 డిపోకు చెందిన అధికారులు సర్వే నిర్వహించారు. త్వరలోనే బస్సు నడిపిస్తామని వరంగల్-2 డిపో మేనేజర్ సురేశ్ తెలిపారు. పత్తిపల్లి-పొట్లాపూర్ మార్గంలో బస్సు సర్వీసును అందుబాటులోకి తీసుకొస్తామని, ఈ మేరకు ఆ రూట్లో సర్వే పూర్తి చేశామని వివరించారు. కాగా మంత్రి సీతక్క సొంత గ్రామం జగ్గన్నపేట ములుగు జిల్లా ఉంది. ఈ గ్రామానికి రోడ్డు మార్గం ఉన్నప్పటికీ ఆర్టీసీ ప్రస్తుతం బస్సులు నడపటం లేదు. ‘మహాలక్ష్మి’ పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న నేపథ్యంలో జగ్గన్నపేట గ్రామానికి బస్సులు నడపకపోవడంపై స్థానికంగా చర్చ జరిగింది. ఈ మేరకు మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఈ విషయం ఆర్టీసీ అధికారుల దృష్టికి వెళ్లడంతో స్పందించారు. దీంతో ఎట్టకేలకు తమ గ్రామానికి బస్సు సౌకర్యం రాబోతోందని జగ్గన్నపేట గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also..
Read Also..