లీడర్లను కొనవచ్చు కానీ తమ ప్రజల ఆత్మ గౌరవాన్ని కొనలేరని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డిలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి మాట్లాడుతూ… రాహుల్, ప్రియాంకలు కర్ణాటకలో అయిదు హామీలు చెప్పారని అక్కడి ప్రజలు నమ్మి ఓటేశారన్నారు. వారు అధికారంలోకి వచ్చాక ఉన్న కరెంటు పోయిందన్నారు. వారి పరిస్థితి పెనం మీది నుండి పోయిల పడ్డట్టు అయ్యిందన్నారు. వైఎస్ పీరియడ్‌లో ఉచిత కరెంటు అని ఉత్త కరెంటు చేసిండ్రని వ్యాఖ్యలు చేశారు. కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా అంటూ ప్రశ్నించారు. కరెంటు కావాలంటే కారుకు ఓటు వేయండన్నారు. కేసీఆర్ ఇంత మంచిగ చేస్తుండగా కాంగ్రెస్ వాళ్ళను నమ్మడం దేనికి రిస్క్‌ల పడటం దేనికని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు రైతుల దగ్గర డబ్బులు వసూలు చేశారని రైతులకు తిరిగి డబ్బులు ఇచ్చింది ఒక్క కేసీఆరే అని చెప్పుకొచ్చారు. తమ పథకాలు కాంగ్రెస్ వాళ్లు నకల్ కొట్టారు కానీ ఆఖల్ లేదన్నారు. కేసీఆర్ ఎకరాకు 16 వేల రూపాయలు ఇస్తా అంటే కాంగ్రెస్ వాళ్లు రైతుకు 15వేల రూపాయలు అంటున్నారన్నారు.
కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేసిన హరీష్ రావు..
50
previous post