హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మాత్యులు పొన్నం ప్రభాకర్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. మంత్రి పొన్నం రోగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, ఆసుపత్రి అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డులను కలియదిరిగారు. రోగులకు అందిస్తున్న సేవలు, ఇతర సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. మందులు, ఆహారం అందుబాటులోనే ఉన్నాయా? అని ఆరా తీశారు. అన్నీ సక్రమంగా అందుతున్నాయని రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు. దవాఖానాలో రోగులకు అందిస్తున్న సేవలపై మంత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ts politics
ప్రభుత్వంలో ఎవరూ నామాట కాదనరని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో మంగళవారం రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిస్తే ఎంత అభివృద్ధి చేస్తానో అంతకంటే రెట్టింపు అభివృద్ధి చేస్తా అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పథకం నీరు వస్తుందో లేదో తెలియదు, వేసవిలో తాగు నీటి ఎద్దడి లేకుండా చూస్తా అన్నారు.
ఆర్టీసీలో కారుణ్య నియామకం కోసం పది సంవత్సరాల నుంచి తిరుగుతున్న పట్టించుకోవడం లేదని ఓ యువకుడు దుబాయ్ నుండి మాట్లాడిన వీడియో లో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాను మాట్లాడుతూ రికార్డ్ చేసిన వీడియోను పంపాడు. జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ కు చెందిన రాగుల వెంకటేష్ తండ్రి మల్లయ్య జగిత్యాల ఆర్టీసీ డిపోలో పని చేసేవాడు. అప్పట్లో బస్సు రిపేర్ చేస్తుండగా బలమైన రాడ్డు కాళ్లపై పడి తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుండి మెట్పల్లి, మంథని డిపోల్లో కొనసాగుతూ ఉన్నాడు. మంథని డిపో మేనేజర్ సూచన మేరకు కరీంనగర్ లో వైద్య పరీక్షల కోసం వెళ్లగా నీవు ఉద్యోగం చేయడానికి పనికి రావని వైద్యులు తేల్చి చెప్పారు. ఈ లోగా కాలి గాయం విషమయంగా మారి మల్లయ్య మృతి చెందాడు. అయితే మల్లయ్య కుమారుడు వెంకటేష్ ఆర్టీసీ లో కారుణ్య నియామకం కోసం 10 సంవత్సరాల నుండి ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో ఉపాధి కోసం దుబాయ్ వెళ్ళాడు. రాష్ట్రంలో ఇటీవల కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇప్పటికైనా తనకు ఆర్టీసీలో కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పించాలని దుబాయ్ నుండి వెంకటేష్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దేశంలో నే నెంబర్ వన్ గా తీర్చిదిద్దిన కెసిఆర్ నాయకత్వం లేని తెలంగాణను ప్రజలు ఊహించుకోలేకపోతున్నారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. స్థానిక సుమంగళి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చదు. నెరవేర్చినట్లు చరిత్రలో లేదన్నారు జగదీశ్ రెడ్డి. రోజులు కాదు కదా 900 రోజులు ఆగిన కాంగ్రెస్ హామీలు అమలు కావని, ప్రజల నుంచి ప్రశ్న రావాలని అప్పటివరకు ఓపికగా ఉండాలన్నారు. ఇవ్వడం చేతకాక దాని నుంచి తప్పించుకునేందుకు అప్పులు చేశారని అంటారని అసెంబ్లీలో నన్ను అడిగితే దానికి సమాధానం నేను చెప్పేవాన్ని అన్నారు. విద్యుత్ పై అసెంబ్లీలో చర్చ వాళ్ళు పెట్టడం కాదు నేనే పెట్టి ఉన్నది ఉన్నట్లు చెబుతానన్నారు జగదీశ్ రెడ్డి. కాంగ్రెస్ డిసెంబర్ 9న రైతుబంధు ఇస్తామని ఇవ్వలేదని తాము ఇస్తామంటే ఈసీకి ఫిర్యాదు చేశారని ఇప్పుడు పాత పద్ధతి లో వేస్తామని అంటున్నారని అన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామన్నారు. అవసరమైతే కొత్త రుణాలు తీసుకోమన్నారు అది కూడా అమలు కాలేదు అన్నారు జగదీశ్ రెడ్డి. ధాన్యంకు కింటాకు భోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పారని ఇంతవరకు దాని వూసే లేదనీ విమర్శించారు జగదీశ్ రెడ్డి.
హుస్నాబాద్ లో మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం స్థల సేకరణ జరుగుతోందని రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్, వార్డు కౌన్సిలర్లతో మున్సిపాలిటీ అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తాను ఎంపీగా ఉన్న సమయంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఏర్పాటు చేశామన్నారు. హుస్నాబాద్ లో కేంద్రీయ విద్యాలయం కోసం ప్రయత్నం చేస్తున్నానని వెల్లడించారు. హుస్నాబాద్ పట్టణంలోని వార్డుల్లో సమస్యలు తెలుసుకొని, పరిష్కారమార్గం చూపెడదమని పాలకవర్గానికి దిశా నిర్దేశం చేశారు. రాజకీయాలకు అతీతంగా హుస్నాబాద్ అభివృద్ధి కోసం కలిసి కట్టుగా పనిచేస్తానని, ఏ సమస్యలు ఉన్న మధ్యవర్థుల ప్రమేయం లేకుండా ప్రజలు నేరుగా తనను కలవవచ్చునన్నారు. గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు తెలుసుకొని, వాటిని పరిష్కరించి సాధ్యమైనంత త్వరగా గౌరవెల్లి ప్రాజెక్టు ను అందరి సమక్షంలో ప్రారంభించుకుందామని ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రి ఆవరణలో మొక్కను నాటి, వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆసుపత్రిలో వసతులపై రోగులను అడిగి ఆరా తీశారు.
రాజకీయంగా తనకు మరోసారి హుస్నాబాద్ నియోజకవర్గం జన్మనిచ్చిందని, నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడి పని చేస్తానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టి తొలిసారి హుస్నాబాద్ కు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మంత్రి పొన్నం ను గజమాలతో సత్కరించి, పట్టణంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ కూడలి వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీ మేరకు హుస్నాబాద్ కు మెడికల్ కాలేజీ తెచ్చే బాధ్యత తనదన్నారు. సెంటిమెంట్ కాదు, హుస్నాబాద్ లో డెవలప్మెంట్ మొదలయిందని పేర్కొన్నారు. భూనిర్వాసితులను బతిమిలాడైనా నియోజకవర్గంలోని గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేయిస్తానని వెల్లడించారు. హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి అందరూ సహకరించాలని, ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఊరికి వెళ్లి ప్రజల సమస్యలు విని అక్కడికక్కడే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువ మార్పు తీసుకొస్తానని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల మందరం కలిసి ఉమ్మడి జిల్లాను ఊహించని రీతిగా అభివృద్ధి చేస్తామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎక్కడికెళ్లిన గళ్ళ ఎగిరేసుకునే విధంగా పనిచేస్తానని, ప్రతిరోజు ఉదయం హుస్నాబాద్ లో ఉంటే, సాయంత్రం హైదరాబాద్ లో, సాయంత్రం హైదరాబాద్ లో ఉంటే ఉదయం హుస్నాబాద్ లో ఉంటానన్నారు.
బెల్లంపల్లి పట్టణంలో ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలను అమలుచేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే ఆలస్యం, అందులో రెండు గ్యారంటీ పథకాలను అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ఈ పథకాల నుండి మహాలక్ష్మి పథకాన్ని తొలగించాలని, దానివల్ల తమ జీవనాధారం కోల్పోతామని పట్టణ ఆటో యూనియన్ అధ్యక్షుడు కట్టా రాంకుమార్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు అంతా ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటోలనే నమ్ముకుని తాము బ్రతుకు బండిని లాగుతున్నామని, మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలో లక్షల కుటుంబాలు రోడ్డున పడవలసి వస్తుందని, ఒక్కొక్క ఆటో డ్రైవర్ కు పదివేల రూపాయల EMI లు కట్టవలసి ఉంటుందన్నారు. వికలాంగులకు, 60 సంవత్సరాలు దాటిన వృద్దులకు, విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలి. కానీ మహిళలకు ఉచిత ప్రయాణం అనేది వెంటనే తొలగించాలని, ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఈ విషయమై తమ సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. నాలుగైదు రోజులల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తొలగించకపోతే తాము తమ కుటుంబాలతో రోడ్డు పైకి వచ్చి బిక్షాటన చేస్తామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒకటైన చేయూత పథకం కింద రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని పెద్దపెల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చింతకుంట విజయ రమణ రావు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈరోజు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రాజీవ్ గాంధీ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా బీపీల్ కుటుంబాలకు రూ. 10 లక్షల వరకు ఆరోగ్య భీమాను కల్పించే కార్యక్రమాన్ని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ రమణ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒకటైన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అనేది పేదలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ అన్ని ఆరోగ్య కార్యక్రమాల యొక్క ప్రధాన పథకం తెలంగాణలో “అందరికీ ఆరోగ్యం” సాధించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద డయాలసిస్ రోగులకు ఉచితంగా చికిత్స అందిస్తామని అన్నారు. మరియు 126 రకాల చికిత్సలకు ఒక సంవత్సరం కాలం ఉచితంగా మందులు అందిస్తామని అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం నిరుపేద కుటుంబాలకు చికిత్స కోసం సంవత్సరానికి రూ. 10 లక్షల వరకు ఆర్థిక రక్షణను అందిస్తామని పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అన్ని పథకాలను అమలు చేస్తామని విజయరమణ రావు గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా డీఎంహెచ్ఓ ప్రమోద్ కుమార్,పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపరిటెండెంట్ డా.రమాకాంత్, పెద్దపల్లి తహశీల్దార్ రాజ్ కుమార్, పెద్దపల్లి జెడ్పీటీసీ బండారి రాంమూర్తి, రాజీవ్ ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్లు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు, డాక్టర్లు, ఎఎన్ఎంలు, ఆషావర్కర్లు మరియు తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గం, brs నుంచి ఎమ్మెల్యే గా 3వ సారి భారీ మెజారిీతో గెలిచినా సబితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం ప్రజలు భారాస నాయకులు, కార్యకర్తలు తో కలిసి స్థానిక శివ గంగ ఆలయం లో పూజలు చేసి, స్థానిక పోతర్ల బాబయ్యా హల్ లో కార్యకర్తను, నాయకులతో, స్థానిక ప్రజలతో కలసి మాట్లాడరు. కృత్గ్నగా తలు తెలిపారు. మహేశ్వరం ప్రజలు తమ పట్ల చూపిన అభిమానం, ఆదరణ, మరువ లేనిది. మీ రుణం తీర్చుకుంట అని ఎమోషనల్ గా మాట్లాడారు. కష్ట పడి పార్టీ కోసం పని చేసినా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇది విజయోస్థవ సభా కాదు. కృత్గ్న ఙ్ఞత సభ బాధ్యత గా పని చేస్తా, ప్రజా సమస్యల గురించి అలుపు లేకుండా కృషి చేస్తా. ప్రభుత్వం ఎది అయినా పని తీసుకోవడం లో ముందుంట ఇక మీదట మీలో ఉంటా, మీతో కలిసి ఉంటా, ప్రతి ఎలక్షన్ లో మిమ్మలి గెలిపించూకుంట. మి గెలుపు నా గెలుపు ప్రతి ఊరు తిరుగుతూ ప్రతి నాయకుడు, కార్యకర్త తో కలుస్థా మీ గెలుపుకు కృషి చేస్తా… అని తెలిపారు.
: మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణం పురపాలక సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు.. ఈ సందర్బంగా అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఇంచార్జి మున్సిపల్ కమిషనర్ భుజంగం మాట్లాడుతూ.. మున్సిపాలిటీ లో ప్రజలకు ఉన్న సమస్యలైన, ఫిర్యాదులైన తమ ద్రుష్టి కి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని, వారి పరిమితి లో లేనివి పై అధికారుల ద్రుష్టి కి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.మున్సిపాటీ అభివృద్ధి కోసం ప్రజలు, నాయకులు, సిబ్బంది కల్సి కట్టుగా కృషి చేయాలనీ కోరారు.




Total views : 61931