హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Center) :
తెలంగాణలో రాగల నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 – 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Center) హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిజామాబాద్‌లో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
గురు, శుక్ర వారాలలో ఆదిలాబాద్, కోమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో వానలు పడుతాయని పేర్కొంది. శుక్ర, శనివారాలలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్‌తో పాటు జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మెదక్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలుపడుతాయని చెప్పింది. శని, ఆదివారాలలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్‌తో పాటు జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.