నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు తన అనుచరులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ చేరుకొని పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. దీంతో కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాత్రి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఓ కారులో అక్రమంగా మద్యం తరలిస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు సమాచారం ఇస్తే సమాచారాన్ని ఇచ్చిన వారిని కొల్లాపూర్ ఎస్సై, కొల్లాపూర్ మాజీ జెడ్పిటిసి హనుమంతు నాయక్ , ముక్కిడి గుండం మాజీ సర్పంచ్ లోకేష్ యాదవ్ ను అతి దారుణంగా కొట్టారని జూపల్లి ఆరోపించారు. పోలీసులు సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి డైరెక్షన్ లో పనిచేస్తున్నారని అన్నారు. పోలీసులు అధికార బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దౌర్జన్యాలకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో రాక్షస పాలన సాగుతోందని రాయలసీమ రౌడీల లాంటి ఎస్ఐలను కొల్లాపూర్ తీసుకొచ్చి పనిచేపిస్తున్నారని విమర్శించారు. తన కార్యకర్తలపై పోలీసులు బూటు కాళ్లతో తన్నారని బెల్టులతో కొట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణంపై సీఎం కేసీఆర్ కు కేటీఆర్ కు కవితకు హరీష్ రావుకు చెప్పిన పట్టించుకోలేదని ఆయన తెలిపారు. దీని కోసమేనా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది అని ప్రశ్నించారు.
పోలీస్ స్టేషన్ ఎదుట జూపల్లి కృష్ణారావు ధర్నా..
65
previous post