తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (Telangana Chief Secretary Shanti Kumari)
వర్షాకాలం వచ్చే వరకు తాగునీటి సరఫరాను రోజూ పర్యవేక్షించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (Telangana Chief Secretary Shanti Kumari) ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. తాగునీరు, ధాన్యం కొనుగోలు, పాఠశాలల్లో అత్యవసర నిర్వహణ పనులు, వేసవి చర్యలపై ఆమె సమీక్షించారు. రాష్ట్రంలో తాగునీటి పరిస్థితిని నిశితంగా పరిశీలించి, నిరంతరాయంగా నీటి సరఫరా జరిగేలా అద్భుతమైన టీమ్ వర్క్ చేసినందుకు కలెక్టర్లను అభినందించారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు కలెక్టర్ల వద్ద తగినన్ని నిధులు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
వర్షాకాలం ప్రారంభమయ్యే వరకు ప్రతి రోజూ పర్యవేక్షణ ఉండాలని సూచించారు. వడగాలుల తీవ్రతపై ప్రజలకు, సిబ్బందికి అవగాహన పెంచాలన్నారు. ప్రతి ఇంటికి సరిపడా నీటి సరఫరా ఉండేలా తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తాగునీటి పరిస్థితిని పర్యవేక్షించేందుకు నియమించిన ప్రత్యేక అధికారులు గ్రామాలను సందర్శించి నీటి సరఫరాలో జరుగుతున్న అంతరాయాల వివరాలను నేరుగా ప్రజల నుంచి అడిగి తెలుసుకోవాలన్నారు. వరి కొనుగోలు కేంద్రాలను తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ధాన్యం శుభ్రపరిచే యంత్రాలు, టార్పాలిన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.