తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి ప్రత్యేక చరిత్ర ఉంది. గతంలో హేమా హేమీలిలు ఈ నియోజకవర్గం నుండి గెలుపొంది ఉన్నత పదవులను అలంకరించారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తరఫున మదన్ మోహన్, ప్రస్తుతం ముఖ్యమంత్రి తెరాస అధినేత కేసిఆర్ ఈ నియోజకవర్గం నుండే ప్రాతినిధ్యం వహించినారు. 2004 లో మొదటిసారి ఎమ్మెల్యేగా తన్నీరు హరీష్ రావు రాజకీయ అరంగ్రేటం చేసి విజయం సాధించారు. అప్పటి నుండి ఎమ్మెల్యే గా హరీష్ రావు అంచెలంచెలుగా తన మెజారిటీ తనే బ్రేక్ చేస్తూ విజయం సాధిస్తున్నారు. 2019 ఎన్నికల్లో లక్ష పద్దెనిమిది వేల పై చిలుక మెజారిటీతో ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్ దక్కకుండా భారీ మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా సిద్దిపేట నియోజకవర్గంలో మాత్రం హరీష్ రావుకు మరో మారు పట్టం కట్టి భారీ మెజారిటీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులు పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన 9 సంవత్సరాల కాలంలో సిద్దిపేట అభివృద్ధి ఆకాశానికి అంటే విధంగా జరిగింది. నియోజకవర్గం లో రంగనాయక సాగర్ ద్వారా వ్యవసానికి కాల్వల ద్వారా సాగునీటిని అందించడం, మెడికల్ కాలేజ్, సిద్దిపేటకు రైలు తేవడం తో పాటు అనేక అభివృద్ధి పనులు జరిగాయి. జిల్లా ఏర్పాటుతోనే సిద్దిపేట ఎంతో మార్పు చెంది రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన పట్టణముగా రికార్డ్ కు ఎక్కింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు మంత్రి హరీష్ రావు, కేటీఆర్ లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాలు నిర్వహిస్తూ తమ నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకుల ద్వారా ప్రచారం కొనసాగిస్తున్నారు.సిద్దిపేట నియోజకవర్గంలో నాలుగు మండలాలు, సిద్దిపేట మున్సిపాలిటీలలో అధికార బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఉండడం, బిఆర్ఎస్ కు ప్లస్ పాయింట్ మరోవైపు గ్రామ గ్రామాన హరీష్ రావుకు కార్యకర్తల బలం అదనం అసెంబ్లీ ఎన్నికల నగార మోగిన నాటి నుండి నేటి వరకు మంత్రి హరీష్ రావు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో ప్రచారం నిర్వహిస్తుండగా సిద్దిపేట నియోజకవర్గంలో మాత్రం ఇంతవరకు ప్రచారం నిర్వహించకపోవడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల్లో అభ్యర్థులు ప్రచారాలు నిర్వహించడం జరుగుతున్న సిద్దిపేట నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్, బిజెపి,బిఎస్ పి పార్టీల అభ్యర్థులు ఉన్నా టిఆర్ఎస్ పార్టీకి పోటీ కాదని విశ్వాసంతో నాయకులు పనిచేస్తున్నారు. హరీష్ రావు చేసిన అభివృద్ధి పనులు, కార్యకర్తల బలంతో ఈసారి కూడా సిద్దిపేట అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావుకు భారీ మెజారిటీతో గెలుపొందేందుకు నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు..
Read Also…
Read Also…