రైల్వేను ప్రయివేటీకరించే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. రైల్వేలను మరింత మెరుగుపర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నాసిక్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. 400 రూపాయల కంటే తక్కువ ఖర్చుతో ప్రజలు వెయ్యి కిలోమీటర్ల వరకు సౌకర్యంగా ప్రయాణించేలా చూడడమే తమ ధ్యేయమని చెప్పారు. రానున్న ఐదేళ్లలో రైల్వేలు పూర్తి స్థాయిలో మారిపోతాయని తెలిపారు. వందే భారత్, నమో భారత్, కవచ్ రైలు రక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం వంటి వాటి వల్ల అనేక మార్పులకు దారి తీస్తాయన్నారు.
రైల్వేలను ప్రయివేటీకరించే ప్రశ్నే లేదని, ఇలాంటి పుకార్లు వ్యాప్తి చేయడం సరికాదని ఫైర్ అయ్యారు. రైల్వే, రక్షణ రెండు భారతదేశానికి రెండు వెన్నెముకలని కొనియాడారు. రైల్వే రాజకీయీకరణ ఆగిపోతుందని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని, పనితీరు, భద్రత, సాంకేతికతతో అందరికీ మంచి సేవలను అందించడంపై దృష్టి కేంద్రీకరించినట్టు చెప్పారు. గత పదేళ్లలో 31 వేల కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్‌లు వేశామని, ఇది ఫ్రాన్స్ నెట్వర్క్ కంటే ఎక్కువని తెలిపారు. రైల్వే బడ్జెట్ ప్రస్తుతం రూ.2.5 లక్షల కోట్లుగా ఉందన్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ గురించి మాట్లాడుతూ వాటిని అప్‌గ్రేడ్ చేసేందుకు రూ.35 కోట్లు కేటాయించామని, సర్వీస్ రూల్స్, ప్రమోషన్లకు సంబంధించిన పలు డిమాండ్లు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి