కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల కై ఎన్డీఎస్ఏకు లేఖ..

kaleswaram project

Advertisements

&NewLine;<p>కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలపలేదని నేషనల్ డ్యామ్ సెఫ్టీ అథారిటీ పేర్కొంది&period; తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఆమోదించిన డిజైన్లనే డీపీఆర్‌తోపాటూ సమర్పించారని తెలిపింది&period; బ్యారేజీ కుంగిన ఘటనపై తాము 20 రకాల డాక్యుమెంట్లు కోరామని&comma; కానీ ప్రభుత్వం కొన్నింటినే ఇచ్చిందని వెల్లడించింది&period; వాటి ఆధారంగానే తాము నివేదిక ఇచ్చామని స్పష్టం చేసింది&period; బ్యారేజీ కుంగిన నేపథ్యంలో ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన ఎన్‌డీఎస్ఏ బృందం ఆ తరువాత రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు&comma; ఇంజినీర్లతో సమావేశమైంది&period; అనంతరం&period;&period; ప్రభుత్వ అధికారుల ఇచ్చిన సమాచారం పరిగణలోకి తీసుకుని నివేదిక ఇచ్చింది&period; ఈ నివేదికపై రాష్ట్ర ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ ఎన్డీఎస్ఏ చైర్మన్‌కు లేఖ రాయగా సంస్థ కూడా తాజాగా ప్రత్యుత్తరమిచ్చింది&period; మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి ప్లానింగ్&comma; డిజైన్&comma; క్వాలిటీ కంట్రోల్&comma; ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపాలున్నాయని మరోసారి చెప్పింది&period; అక్టోబర్ 21à°¨ మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్‌లో పిల్లర్ కుంగిపోయిన విషయం తెలిసిందే&period; బ్యారేజీలోని ఏడో బ్లాక్‌లోని పిల్లర్లు కుంగిపోయి&comma; వాటిల్లో పగుళ్లు వచ్చాయని ఎన్డీఎస్ఏ పేర్కొంది&period; పిల్లర్లు ముందుకు కదిలాయని తన లేఖలో స్పష్టం చేసింది&period; ఇందుకు కారణాలపై స్టడీ చేయాలని ఇప్పటికే తాము తెలంగాణ ప్రభుత్వానికి సూచించామని తెలిపింది&period; అన్నారం&comma; సుందిళ్ల బ్యారేజీల పునాదుల కింది నుంచి పైపింగ్ జరిగిందని ఎన్డీఎస్ఏ తెలిపింది&period; మేడిగడ్డ బ్యారేజీలో నిర్మాణ లోపాలపై కేంద్ర కమిటీకి సమగ్రమైన అవగాహన ఉందని వ్యాఖ్యానించింది&period; ఆ అవగాహనతోనే నిర్ధారణకు వచ్చామని&comma; తాము నిరాధారంగా నివేదిక ఇవ్వలేదని తేల్చి చెప్పింది&period; నిరంతర పర్యవేక్షణ&comma; నిర్వహణ లోపంతోనూ సమస్య తలెత్తింది పేర్కొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..