తెలంగాణ ఉద్యమం కెసీఆర్ ఇంటి వాళ్ళు ముగ్గురు చేస్తే రాలేదు తెలంగాణ నిరుద్యోగ యువత తెలంగాణ విద్యార్థులు ఆత్మబలి దానాలతో చలించిపోయిన సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించడం జరిగింది. తెలంగాణలో సుమారు పది లక్షల మంది గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందడం జరుగుతుంది. ఒక్కరికి పదివేల చొప్పున ఉన్నా గాని తెలంగాణకు నెలకు సుమారు 1000 కోట్లను గల్ఫ్ కెళ్ళి వీళ్ళు గల్ఫ్ కార్మికులు సంవత్సరానికి 12 వేళా కోట్లు విదేశీ మరగద్రవ్యాన్ని తెలంగాణకు సమకూరుస్తున్నారు. ఇందులో ఎంత లేకుండా సుమారు గవర్నమెంట్ కి 10% ఆదాయం అనుకున్న కానీ గత పది సంవత్సరాల నుండి గవర్నమెంట్ కు ఒక లక్ష ఇరవై వేల కోట్లను సమకూర్చడం జరుగుతుంది. కానీ గల్ఫ్ కార్మికులకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. నువ్వు గొప్పగా చెప్పిన కాలేశ్వరం ప్రాజెక్టు ఈరోజు ఏమైంది కాలేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిపోయింది హరీష్ రావు ఏమంటాడు ఒక బ్యారేజ్ పగులు తప్ప మిగతా ఇంకా రెండు లేవా ఒక మేడిగడ్డ కృంగిపోతేనే పెద్ద ఏదో జరిగినట్టు అంటున్నారు ప్రతిపక్షాలు మేడిగడ్డ లేకపోతే అన్నారం ఉండదు అన్నారం లేకపోతే. సుందిళ్ళ ఉండదు కేసీఆర్ అంటాడు పగులు వచ్చింది అని పగులు వచ్చిన కుండకు నీళ్లు ఆగుతాయ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మొదటగా గల్ఫ్ కార్మికులు గల్ఫ్ లో అసువులు బాసిన ప్రతి కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున కేటాయిస్తాం . ప్రభుత్వం ఏర్పడగానే స్థానికంగా ఉన్న షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడంతో పాటు యువతకు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము. జగిత్యాలలో నేను మంత్రిగా ఉన్నప్పుడు దిగవంత నేత రత్నాకర్ రావు నేను పోటీపడి అభివృద్ధి చేసినం. నేను జగిత్యాల్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ పెడితే దిగవంతనేత రత్నాకర్ రావు గారు కోరుట్లలో పశు వైద్య కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే కోరుట్ల పట్టణానికి ఏం చేశాడు చెప్పాలి.
బీఆర్ఎస్ పై ఏమ్మెల్సీ జీవన్ రెడ్డి కామెంట్స్
70
previous post