70
తిరుమల శ్రీవారి దర్శనార్థం ఈరోజు సాయంకాలం 7 గంటల 45 నిమిషాలకు తిరుమల కు రానున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేణిగుంట విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలుకుతారు. అనంతరం ప్రధాని మోడీ రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకుంటారు. తిరుమలలో ఏర్పాటు చేసిన అతిధి గృహాం వద్ద టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలుకనున్నారు. పద్మావతి అతిథి గృహాల ప్రాంతంలో ఉన్న ఓ అతిథి భవనంలో నరేంద్ర మోడీ బస ఏర్పాట్లను చేశారు. ఆ ప్రాంతం మొత్తాన్ని ఎస్పీజీ ఆధీనంలోనికి తీసుకుంది. అధికారులు ప్రధాని మోడీ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.