ప్రధాని మోదీ (Narendra Modi) యూపీలోని వారణాసి లోక్‌సభ ఎంపీ స్థానానికి ఈ నెల 14న నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ వేయడానికి ఒకరోజు ముందు 13వ తేదీన భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. జిల్లా అధికారుల సమాచారం ప్రకారం ఈ రోడ్ షో ప్రారంభించడానికి ముందు ప్రధాని లంకలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రధాన గేటు వద్ద ఉన్న మదన్ మోహన్ మాలవ్య విగ్రహానికి నివాళ్లు అర్పిస్తారు. ఆ తర్వాత రోడ్ షోలో పాల్గొంటారు. ఈ రోడ్ షో కాశీ విశ్వనాథ్ కారిడార్ వరకు ఐదు కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. లక్షలాది మంది ఈ రోడ్ షోలో పాల్గొనే అవకాశం ఉంది. అస్సి, సోనార్‌పూర, జంగం బరి, గోడౌలియా, బన్స్‌పథక్ మీదుగా విశ్వనాథ్ కారిడార్‌కు చేరుకుంటుందని బీజేపీ నేత దీలిప్ పటేల్ వెల్లడించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ రోడ్ షో చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించే బాధ్యతను పార్టీ కార్యకర్తలకు అప్పగించినట్లు చెప్పుకొచ్చారు. వారణాసి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మీటింగులు ముగిసిన తర్వాత 21 డివిజన్లలోని పార్టీ కార్యకర్తలను ప్రధాని రోడ్ షోకు భారీ సంఖ్యలో జనాలను తీసుకువచ్చేలా దిశానిర్దేశం చేయనున్నారు. ఇక వారణాసి నుంచి మోదీ ఇప్పటికే రెండుసార్లు ఎంపీగా గెలిచారు. వరుసగా 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన విజయఢంకా మోగించారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మెక్సికోలో భారీ భూకంపం.మెక్సికో దక్షిణ పసిఫిక్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. గ్వాటెమాలా సరిహద్దుకు సమీపంలో చోటుచోసుకున్న ఈ భూప్రకంపనల ప్రభావం మెక్సికో సిటీతో పాటు ఎల్ సాల్వడార్ వరకు విస్తరించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా నమోదైంది. గంట వ్యవధిలో…
- షార్ నుంచి తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం.భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో సరికొత్త శకం ఆరంభమైంది. హైదరాబాద్‌కు చెందిన స్పేస్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ రూపొందించిన ఆర్బిటాల్ రాకెట్ ‘విక్రమ్-1’ నేడు నింగిలోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించడానికి సిద్దంగా ఉంది. ఈ ప్రయోగానికి ‘మిషన్ ఆగమన్’ అని పేరు…
- తమిళనాడు పెరంబలూర్ వద్ద ఘోర ప్రమాదం.తమిళనాడు పెరంబలూర్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. చెన్నై-మధురై హైవేపై ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డారు 23 మంది ప్రయాణికులు. ప్రైవేట్ స్లీపర్ బస్సులో ఎగసిపడిన మంటలు క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది.…





Total views : 214640