పార్వతీపురం మండలంలోని పుట్టూరు గ్రామముకు చెందిన ఆదిమూల లక్ష్మణ భార్య గుంపమ్మ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోసిస్తునారు.వీళ్ళకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు.
వీళ్ళ పెద్ద కుమారుడు ఆరు నెలల కిందట దురదుష్టవసాత్తు మేడ మీద నుంచి జారి పడి చనిపోవడం జరిగింది.
ఈ నేపథ్యంలో కూలీ పనులు చేసుకుంటూ ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులకు చేద పురుగులు పట్టి ఎందుకు పనికిరాని చెత్తగా మారడంతో ఆ కుటుంబం దిక్కుతోచని పరిస్థితుల్లో పడింది.
కూతురుకు పెళ్లి ఉపకారంతో నిమిత్తం గత కొన్ని నెలలుగా ట్రంక్ పెట్టేలోని ఒక బ్యాగలో దాచిన డబ్బుల కోసం ఆ పెట్టెను తెరవగా చెదల పురుగుల మధ్య 500 రూ, 100 రూ నోట్లు ముక్కలుగా మారి మట్టితో కనిపించాయి.
సుమారు రెండు లక్షల రూపాయలు చెదలు పట్టి ముక్కలు ముక్కలుగా కనిపించడంతో భాదితులు కన్నీరు మున్నీరు అయ్యారు.
చెమట చిందించి కష్టపడి డబ్బులకు చెద పురుగులు పట్టడంతో ఈ రైతు ఆవేదన దుఃఖం చూసి స్థానికులు
చలించిపోయారు..ప్రభుత్వం కానీ నాయకలు కానీ సహాయం చేసి వాళ్ళని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు..
కూతురు పెళ్లి కోసం దాచిన సొమ్ము చెదలు పాలు…
53