70
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం శివారు గంటా ఊరు వద్ద శనివారం ఉదయం ఎస్విఎంఎస్ బస్సు ఢీకొని ద్విచక్ర వాహనంలో పలమనేరుకు వస్తున్నటువంటి తల్లి కుమార్తెలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 వర్గాలకు సమాచారం అందించారు. 108 డ్రైవర్ బాబజాన్, ఈఎంటి ప్రీతి సంఘటన ప్రాంతానికి చేరుకొని గాయపడిన తల్లి కూతుర్లను పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.