72
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం చిన్న ఓరం పాడు గ్రామానికి చెందిన దుర్గమ్మ తన కూతురు కనిపించడం లేదని ఓబులవారిపల్లె పోలీసులను ఆశ్రయించింది. కూతురు అదృశ్యంపై పట్టించుకోలేదని ఆమె తెలిపారు. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న భాస్కర్ అనే పోలీస్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తం చేశారు. నా కూతుర్ని 20 వేలు డబ్బు తీసుకొని ప్రేమించిన వాడితో పోలీసులు పంపించారని దుర్గమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు పోలీస్ స్టేషన్కు తిప్పుకొని పోలీసులు న్యాయం చేయలేదన్నారు. తనపై అసభ్యంగా ప్రవర్తించిన పోలీస్ పై ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని బాదితురాలు విన్నవించారు.
Read Also..