జీవితంలో ఎన్నో అపజయాలు ఎదుర్కొన్నా.. ఏం జరిగినా జనసేనను మరో పార్టీలో విలీనం చేయనని ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. విశాఖలోని ఎస్.రాజా గ్రౌండ్లో నిర్వహించిన జనసేన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. విశాఖ ఉక్కు అంశం భావోద్వేగంతో కూడిన అంశమని అన్నారు. ఇదే విషయాన్ని కేంద్రంలోని పెద్దలకు సైతం చెప్పినట్లు పవన్ తెలిపారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే ఎలాంటి భావోద్వేగాలకు దారి తీస్తుందో తెలియదన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ పోరాటం.. అన్ని జిల్లాలను ఏకం చేసిన నినాదం అని.. ప్రైవేటీకరణ కాకుండా ప్రయత్నం చేయగలిగామన్నారు. తాను ఎప్పుడూ ఎన్నికల కోసం ఆలోచించలేదని.. ఒక తరం కోసం ఆలోచించినట్లు చెప్పారు. ఈ తరాన్ని కాపాడుకుంటూనే రాబోయే తరం కోసం పని చేస్తానన్నారు. తాను ఓట్ల కోసం రాలేదని.. మార్పు కోసం ఓట్లు కావాలని పవన్ వెల్లడించారు.
cvr cvr telugu
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం చిన్న ఓరం పాడు గ్రామానికి చెందిన దుర్గమ్మ తన కూతురు కనిపించడం లేదని ఓబులవారిపల్లె పోలీసులను ఆశ్రయించింది. కూతురు అదృశ్యంపై పట్టించుకోలేదని ఆమె తెలిపారు. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న భాస్కర్ అనే పోలీస్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తం చేశారు. నా కూతుర్ని 20 వేలు డబ్బు తీసుకొని ప్రేమించిన వాడితో పోలీసులు పంపించారని దుర్గమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు పోలీస్ స్టేషన్‌కు తిప్పుకొని పోలీసులు న్యాయం చేయలేదన్నారు. తనపై అసభ్యంగా ప్రవర్తించిన పోలీస్ పై ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని బాదితురాలు విన్నవించారు.
Read Also..
కళ్ల కింద ఉన్నట్లుండి వచ్చిన నల్లటి వలయాలు అస్సలు తగ్గట్లేదా. అయితే ముందు ఆహారంలో కొన్ని సులభమైన మార్పులు చేసుకుని చూడండి. కొంత మంది ముఖాన్ని చూడగానే కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటాయి. ఈ నల్లటి వలయాలు వారి ముఖ సౌందర్యాన్ని చెడగొడతాయి. సరిగ్గా నిద్ర లేకపోవడం, అలర్జీలు, జ్వరాలు వచ్చి తగ్గడం, హైపర్ పిగ్మంటేషన్, కళ్ల చుట్టూ చర్మం పల్చగా మారడం, ఐరన్ లోపం, ఎక్కువగా ఎండలో ఉండటం, ధూమపానం, థైరాయిడ్, సరిపడా నీరు తాగకపోవడం, జన్యుపరమైన కారణాల వల్ల ఇవి చాలా మందికి వస్తుంటాయి. అయితే ఆహారంలో కొన్ని మార్పుచేర్పులు చేసుకోవడం ద్వారా వీటిని తగ్గించుకోవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. కళ్ల చుట్టూరా నల్లటి వలయాలతో ఇబ్బందులు పడేవారు ఎక్కువగా సీ విటమిన్ ఉండే ఆహార పదార్థాలను తినాలి. విటమిన్ సీ అనేది ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షించి ఇలాంటి వాటి నుంచి కాపాడుతుంది. అందుకు నిమ్మ, ఉసిరి, క్యాప్సికం, కివి, బెర్రీలు, కమలాపండ్లు, జామకాయలు లాంటి వాటిని రోజూ తీసుకుంటూ ఉండాలి. అలాగే లైకోపీన్ అనేది మన చర్మాన్ని పిగ్మంటేషన్ నుంచి కాపాడుతుంది. ఇది టమోటాలు, పుచ్చ కాయలు, క్యాప్సికం, క్యారెట్లు, జామ కాయలు తదితరాల ద్వారా పుష్కలంగా లభిస్తుంది. శరీరంలోని కణ జాలాలు అన్నింటికీ పుష్కలంగా ఆక్సిజన్ సరఫరా కావాలంటే ఐరన్ సరిపడనంతగా ఉండాలి. ఇది పాల కూర, బచ్చలి, గుమ్మడి గింజలు, ఎండు ద్రాక్ష, పప్పు ధాన్యాలు, ఆకు కూరల్లో పుష్కలంగా లభిస్తుంది. అలాగే కళ్ల కింద నలుపుల్ని తగ్గించడంలో విటమిన్ ఈ కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పొద్దు తిరుగుడు గింజలు, బాదాం, అవకాడో, వేరు శెనగ గింజలు, బంగాళ దుంప లాంటి వాటిని తినడం వల్ల ఇది సమృద్ధిగా మనకు లభిస్తుంది.
Read Also..
Read Also..





Total views : 80634