Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Health కళ్ల చుట్టూ నల్లటి వలయాలా.. ఈ ఆహారాలతో చెక్‌!

కళ్ల చుట్టూ నల్లటి వలయాలా.. ఈ ఆహారాలతో చెక్‌!

by Satya
Dark circles around the eyes

కళ్ల కింద ఉన్నట్లుండి వచ్చిన నల్లటి వలయాలు అస్సలు తగ్గట్లేదా. అయితే ముందు ఆహారంలో కొన్ని సులభమైన మార్పులు చేసుకుని చూడండి. కొంత మంది ముఖాన్ని చూడగానే కళ్ల చుట్టూ డార్క్‌ సర్కిల్స్‌ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటాయి. ఈ నల్లటి వలయాలు వారి ముఖ సౌందర్యాన్ని చెడగొడతాయి. సరిగ్గా నిద్ర లేకపోవడం, అలర్జీలు, జ్వరాలు వచ్చి తగ్గడం, హైపర్‌ పిగ్మంటేషన్‌, కళ్ల చుట్టూ చర్మం పల్చగా మారడం, ఐరన్‌ లోపం, ఎక్కువగా ఎండలో ఉండటం, ధూమపానం, థైరాయిడ్‌, సరిపడా నీరు తాగకపోవడం, జన్యుపరమైన కారణాల వల్ల ఇవి చాలా మందికి వస్తుంటాయి. అయితే ఆహారంలో కొన్ని మార్పుచేర్పులు చేసుకోవడం ద్వారా వీటిని తగ్గించుకోవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. కళ్ల చుట్టూరా నల్లటి వలయాలతో ఇబ్బందులు పడేవారు ఎక్కువగా సీ విటమిన్‌ ఉండే ఆహార పదార్థాలను తినాలి. విటమిన్‌ సీ అనేది ఫ్రీ రాడికల్స్‌ నుంచి కణాలను రక్షించి ఇలాంటి వాటి నుంచి కాపాడుతుంది. అందుకు నిమ్మ, ఉసిరి, క్యాప్సికం, కివి, బెర్రీలు, కమలాపండ్లు, జామకాయలు లాంటి వాటిని రోజూ తీసుకుంటూ ఉండాలి. అలాగే లైకోపీన్‌ అనేది మన చర్మాన్ని పిగ్మంటేషన్‌ నుంచి కాపాడుతుంది. ఇది టమోటాలు, పుచ్చ కాయలు, క్యాప్సికం, క్యారెట్లు, జామ కాయలు తదితరాల ద్వారా పుష్కలంగా లభిస్తుంది. శరీరంలోని కణ జాలాలు అన్నింటికీ పుష్కలంగా ఆక్సిజన్‌ సరఫరా కావాలంటే ఐరన్‌ సరిపడనంతగా ఉండాలి. ఇది పాల కూర, బచ్చలి, గుమ్మడి గింజలు, ఎండు ద్రాక్ష, పప్పు ధాన్యాలు, ఆకు కూరల్లో పుష్కలంగా లభిస్తుంది. అలాగే కళ్ల కింద నలుపుల్ని తగ్గించడంలో విటమిన్‌ ఈ కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పొద్దు తిరుగుడు గింజలు, బాదాం, అవకాడో, వేరు శెనగ గింజలు, బంగాళ దుంప లాంటి వాటిని తినడం వల్ల ఇది సమృద్ధిగా మనకు లభిస్తుంది.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: