వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దూళిపాళ్ళ నరేంద్ర తీవ్ర స్తాయిలో విమర్శలు చేశారు. సజ్జల డైరెక్షన్ లోనే సంగం డైరీని దెబ్బతీయాలని చూస్తున్నారు. పోలీసులు వైసీపీ ప్రైవేటు సైన్యంగా పనిచేస్తున్నారు అనీ మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదనీ, సంగం డైరీ రైతుల చేత, రైతుల కొరకు, రైతుల భాగస్వామ్యంతో నడిచే సంస్ధ అని అన్నారు. సంగం డైరీలో రాజకీయాలు ఉండవని పాడి రైతులంతా మాకు సమానమే అనీ తెలిపారు. రైతుల ముసుగులో కిరాయి మూకలు సంగండైరీలో విధ్వంసం సృష్టించాలన్న ప్రయత్నం చేశారనీ, సంగం డైరీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాన్ని చట్టపరంగా ఎదుర్కొంటామన్నారు. టీడీపీ తరపున క్రియాశీలకంగా పనిచేసేవారిని టార్గెట్ గా చేసుకొని కేసులు పెట్టారని తెలిపారు. సంగం డైరీ పుట్టుక పాడి రైతుల ఆత్మగౌరవం నుంచి వచ్చిందని అన్నారు.
వైసీపీ ప్రభుత్వంపై నరేంద్ర విమర్శలు..!
72
previous post