ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం.

Advertisements

<p>ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నీతి ఆయోగ్ 11à°µ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది&period; ఈ సమావేశంలో దేశాభివృద్ధి&comma; సమగ్ర మానవ వనరుల పురోగతి&comma; 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత లక్ష్య సాధనపై కీలకంగా చర్చించారు&period; 2047 సంవత్సరం నాటికి భారతదేశాన్ని పూర్తి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యంగా&period;&period; ఈ ఏడాది సమావేశాన్ని నిర్వహిస్తున్నారు&period; ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశంలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడం&comma; నైపుణ్యాభివృద్ధిని బలోపేతం చేయడం&comma; స్థిరమైన ఉపాధి అవకాశాలను విస్తరించడంపై చర్చించారు&period;<&sol;p>&NewLine;<p>ఈ హై ప్రొఫైల్ సమావేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల సీఎంలు&comma; కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు&comma; కేంద్ర మంత్రులు&comma; నీతి ఆయోగ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు&period; లింగ&comma; ప్రాంతీయ&comma; సామాజిక-ఆర్థిక భేదాలు లేకుండా దేశంలోని ప్రతి పౌరుడికి ఆరోగ్యం&comma; సరైన పోషకాహారం&comma; భవిష్యత్తుకు సరిపడే నైపుణ్యాభివృద్ధి&comma; ఉత్పాదక ఉపాధిని కల్పించడంపై ఇందులో సుదీర్ఘంగా చర్చించారు&period; డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సుపరిపాలన ద్వారా ఈ అభివృద్ధి ఫలాలను క్షేత్రస్థాయిలోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ఈ సమావేశంలో ఖరారు చేసినట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p>ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి&comma; అస్థిరతల మధ్య కూడా భారత్ తన ఆర్థిక వృద్ధిని స్థిరంగా కొనసాగిస్తోందని మోదీ స్పష్టం చేశారు&period; కొత్త ఉపాధి&comma; ఎగుమతుల అవకాశాల కోసం భారత్ అనేక దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల గురించి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది&period; రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి ప్రణాళికలను జాతీయ అభివృద్ధి లక్ష్యాలతో అనుసంధానం చేయడం&comma; సమన్వయంతో ముందుకు సాగడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యంగా నిలిచింది&period; అలాగే 2025 డిసెంబర్‌లో జరిగిన 5à°µ జాతీయ ప్రధాన కార్యదర్శుల సదస్సులో వచ్చిన సిఫార్సులను కూడా సమావేశంలో సమీక్షించారు&period; ప్రాథమిక విద్య&comma; పాఠశాల విద్య&comma; నైపుణ్యాభివృద్ధి&comma; ఉన్నత విద్య&comma; క్రీడలు&comma; పాఠ్యేతర కార్యక్రమాల అభివృద్ధిపై ప్రత్యేకంగా చర్చలు జరిగినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.