యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ 2026 ఫలితాలు విడుదల.

యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ 2026 ఫలితాలు విడుదల

Advertisements

<p>యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 ఫలితాలను విడుదల చేసింది&period; దేశవ్యాప్తంగా మొత్తం 13వేల 343 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు&period; అర్హత సాధించిన అభ్యర్థుల రోల్ నంబర్లతో కూడిన జాబితాను యూపీఎస్సీ తన అధికారిక వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచింది&period; ఈ ఏడాది మే 24à°¨ దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు&period; మొత్తం ఒక వెయ్యి పదహారు సివిల్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా&comma; మెయిన్స్‌కు ఎంపికైన వారి జాబితాను ప్రకటించారు&period; మెయిన్స్‌కు అర్హత పొందిన అభ్యర్థులు తప్పనిసరిగా జూన్ 19 నుంచి 28 మధ్య యూపీఎస్సీ పోర్టల్‌లో లాగిన్ అయి డిటైల్డ్ అప్లికేషన్ ఫామ్ నింపాల్సి ఉంటుంది&period; ఈ సమయంలోనే 200 రూపాయల పరీక్ష ఫీజును చెల్లించాలి&period; అయితే&comma; మహిళలు&comma; ఎస్సీ&comma; ఎస్టీ&comma; దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు&period; అభ్యర్థులు సాధించిన మార్కులు&comma; కటాఫ్ మార్కులు&comma; ఆన్సర్ కీలను సివిల్ సర్వీసెస్ 2026 తుది ఫలితాలు వెలువడిన తర్వాతే ప్రకటిస్తామని యూపీఎస్సీ స్పష్టం చేసింది&period; ఏవైనా సందేహాలుంటే యూపీఎస్సీ కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చని సూచించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..