టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్గాంధీ ఫైర్.

టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్గాంధీ ఫైర్

Advertisements

<p>నీట్‌ పునఃపరీక్ష నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ &OpenCurlyQuote;టెలిగ్రామ్‌’పై కేంద్రం నిషేధం విధించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ తప్పుబట్టారు&period; కేంద్రం చర్య దొంగను పట్టుకోవడానికి బదులుగా&period;&period; బాధితుడి ఇంటి తలుపునకు తాళం వేయడంలా ఉందంటూ ఎద్దేవా చేశారు&period; నోట్స్&comma; టెస్ట్ సిరీస్‌లు&comma; చర్చలు&comma; ప్రిపరేషన్ కోసం లక్షలాది మంది విద్యార్థులు ఎప్పటినుంచో టెలిగ్రామ్‌ ను ఉపయోగిస్తున్నారని&period;&period; దీనిపై నిషేధం విధించడం వల్ల వారు నష్టపోయే ప్రమాదముందని పేర్కొన్నారు&period; అసలు ఈ ఆలోచన పేపర్‌ లీక్‌లు అరికట్టడానికి ఎలా ఉపయోగపడుతుందని ప్రశ్నించారు&period; నిందితులు టెలిగ్రామ్‌ కాకుంటే వాట్సప్‌లోనూ పేపర్లు లీక్‌ చేస్తారని అన్నారు&period; అలా అని వాట్సప్‌ను కూడా బ్యాన్‌ చేస్తారా&quest; అంటూ ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;<p>ఈ నిషేధం తీరు పరీక్షల్లో మోసాలకు పాల్పడే పేపర్ లీక్ నెట్‌వర్క్‌లను కాకుండా&comma; విద్యార్థులనే లక్ష్యంగా చేసుకున్నట్లుగా ఉందని రాహుల్‌ ఆక్షేపించారు&period; నీట్‌ అభ్యర్థులకు జరిగిన అన్యాయం నుంచి దృష్టి మరల్చడానికే కేంద్రం ఈ ఎత్తుగడ వేసిందని విమర్శించారు&period; దేశంలో పదేపదే పేపర్‌ లీక్‌లకు పాల్పడుతున్న నిందితులపై చర్యలు తీసుకోవడంలో మోదీ యంత్రాంగం విఫలమైందన్నారు&period; ప్రభుత్వ కనుసన్నల్లోనే పేపర్ లీక్‌ మాఫియా నడుస్తోందని&period;&period; దానిని కప్పిపుచ్చుకొనేందుకే పరీక్ష కేంద్రాల వద్ద భద్రతా బలగాలను మోహరించడం&comma; ప్రశ్నపత్రాలను వైమానిక దళం ద్వారా పంపించడం వంటి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు&period; ప్రభుత్వం మాట వినకపోతే తమ హక్కులను ఎలా సాధించుకోవాలో యువతకు తెలుసని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..