ఐఎన్‌ఎస్‌ దుణగిరి, సంశోధక్‌, అగ్రయ్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని.

ఐఎన్‌ఎస్‌ దుణగిరి, సంశోధక్‌, అగ్రయ్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని

Advertisements

<p>భారత ప్రధాని నౌకాదళానికి మరింత బలం చేకూర్చేలా ఐఎన్‌ఎస్‌ దుణగిరి&comma; ఐఎన్‌ఎస్‌ సంశోధక్‌&comma; ఐఎన్‌ఎస్‌ అగ్రయ్‌ అనే మూడు యుద్ధనౌకలను జాతికి అంకితం చేశారు&period; కోల్‌కతాలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ప్రారంభించారు&period; రక్షణ రంగంలో స్వావలంబన సాధనకు ఈ నౌకలు నిదర్శనమని ప్రధాని మోదీ పేర్కొన్నారు&period;<br &sol;>&NewLine;ప్రాజెక్ట్‌–17A కింద నిర్మించిన ఐఎన్‌ఎస్‌ దుణగిరి&period;&period; 149 మీటర్ల పొడవైన అడ్వాన్స్‌డ్‌ గైడెడ్‌ మిసైల్‌ ఫ్రిగేట్‌&period; అత్యాధునిక రాడార్లు&comma; సెన్సర్లు&comma; బ్రహ్మోస్‌ యాంటీ షిప్‌ క్రూజ్‌ క్షిపణులతో ఈ యుద్ధనౌకను సన్నద్ధం చేశారు&period; సముద్రంలో బహుముఖ ఆపరేషన్లు నిర్వహించే సామర్థ్యం దీని ప్రత్యేకత&period; 110 మీటర్ల పొడవున్న ఐఎన్‌ఎస్‌ సంశోధక్‌ను సముద్ర సర్వేలు&comma; నావిగేషన్‌ అధ్యయనాలు&comma; పోర్టుల అభివృద్ధి&comma; సముద్ర మార్గాల మ్యాపింగ్‌ కోసం రూపొందించారు&period; ప్రత్యేక హెలికాప్టర్‌ సదుపాయంతో పాటు విపత్తుల సమయంలో సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా ఇది ఉపయోగపడనుంది&period;<br &sol;>&NewLine;77&period;6 మీటర్ల పొడవున్న ఐఎన్‌ఎస్‌ అగ్రయ్‌ను యాంటీ సబ్‌మెరైన్‌ షాలో వాటర్‌ క్రాఫ్ట్‌గా అభివృద్ధి చేశారు&period; తీర ప్రాంత జలాల్లో జలాంతర్గాములను గుర్తించడం&comma; శత్రువుల కదలికలపై నిఘా పెట్టడం&comma; దాడులు నిర్వహించడం వంటి విధులకు ఇది అనువుగా ఉంటుంది&period; 88 శాతం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ నౌకలో 30 ఎంఎం నేవల్‌ గన్‌&comma; వాటర్‌ జెట్‌ ఆధారిత డీజిల్‌ ఇంజిన్‌ వ్యవస్థను అమర్చారు&period; స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన ఈ మూడు యుద్ధనౌకల చేరికతో భారత నౌకాదళం మరింత ఆధునికంగా&comma; మరింత శక్తివంతంగా మారనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గద్దర్ విగ్రహానికి భూమిపూజ నిర్వహణ.

సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ ట్రైలర్ విడుదల…

బీఆర్ఎస్‌పై చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు.