ఏపీలో రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టులు.

ఏపీలో రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టులు

Advertisements

<p>రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా&comma; ఈ రెండేళ్లలో సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను&comma; మంత్రులను ఆదేశించారు&period; గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఎలా అభివృద్ధి పథంలోకి నడిపించారో ఈ నివేదికల ద్వారా ప్రజలకు వివరించాలని ఆయన స్పష్టం చేశారు&period;<br &sol;>&NewLine;మంత్రులు&comma; ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు&period; 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే గత వైసీపీ ప్రభుత్వ పాలనపై ఏడు అంశాల్లో శ్వేతపత్రాలు విడుదల చేశారు&period; &period; రాష్ట్ర ఆర్థిక పరిస్థితి&comma; పోలవరం ప్రాజెక్టు&comma; అమరావతి రాజధాని&comma; విద్యుత్&comma; శాంతిభద్రతలు&comma; మైనింగ్&comma; ఎక్సైజ్ వంటి అంశాలపై వాస్తవ పరిస్థితులను ఆ శ్వేతపత్రాల ద్వారా ప్రజల ముందు ఉంచారు&period;<&sol;p>&NewLine;<p>ఇప్పుడు ఆ శ్వేతపత్రాలకు కొనసాగింపుగా ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఉండాలని సీఎం సూచించారు&period; వివిధ శాఖల్లో వచ్చిన మార్పులు&comma; అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు&comma; అభివృద్ధి కార్యక్రమాలు&comma; పాలనా సంస్కరణలను సమగ్రంగా ఇందులో పొందుపరచాలన్నారు&period; ప్రభుత్వంపై వస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టేందుకు&comma; వాస్తవాలను ప్రజల ముందు ఉంచి రాష్ట్రాన్ని ఎలా గాడిన పెట్టారో స్పష్టంగా తెలియజేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు&period; ఈ నివేదికల ద్వారా రెండేళ్ల ప్రభుత్వ పనితీరును ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడమే లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు&period; ఇందులో భాగంగా ఇవాళ సీఎం చంద్రబాబు విద్యుత్ తో సహా 4 అంశాలపై నివేదికలు విడుదల చేయనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటన.

280 ఎకరాల వెంచర్‌ వ్యవహారంలో వివాదాలు.

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.