రాష్ట్రపతితో ప్రధాని భేటీ.

రాష్ట్రపతితో ప్రధాని భేటీ

Advertisements

<p>రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు&period; &OpenCurlyQuote;పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం అనంతరం రాష్ట్రపతి భవన్‌లో ఈ రోజు సాయంత్రం ఈ సమావేశం జరిగింది&period; కేంద్ర మంత్రివర్గం పునర్‌వ్యస్థీకరణ ఊహాగానాల వేళ ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది&period;<&sol;p>&NewLine;<p>కేరళకు చెందిన భాజపా నేత జార్జ్‌ కురియన్‌ కేంద్ర సహాయ మంత్రి పదవికి ఈ ఉదయం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే&period; ఆయన రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు&period; ఈ పరిణామంతో కేంద్రమంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ తథ్యమన్న ఊహాగానాలు మొదలయ్యాయి&period; దీనికితోడు ఇటీవల పలువురు కేంద్రమంత్రులకు వారి వారి రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలను అప్పగించడం దీనికి మరింత బలం చేకూరింది&period; కేంద్ర రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రిగా ఉన్న హర్ష్‌ మల్హోత్రాను దిల్లీ భాజపా అధ్యక్షుడిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ మే నెలలో నియమించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.