నేటి నుంచి స్టాక్ మార్కెట్‌కు కొత్త టైమింగ్స్.

Advertisements

<p>భారత స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ వ్యవస్థలో సెబీ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది&period; ఇన్వెస్టర్లకు మెరుగైన అవకాశాలు కల్పించడం&comma; మార్కెట్ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ కొత్త నిబంధనలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి&period; ఈ మార్పుల్లో భాగంగా ఈక్విటీ డెరివేటివ్స్ ట్రేడింగ్ సమయాన్ని పొడిగించడంతో పాటు&comma; F&amp&semi;O విభాగంలో ఉన్న స్టాక్స్‌కు ప్రత్యేకంగా క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ను ప్రవేశపెట్టారు&period; తాజా నిబంధనల ప్రకారం&comma; F&amp&semi;O విభాగంలోని స్టాక్స్ కు రెగ్యులర్ ట్రేడింగ్ మధ్యాహ్నం 3&period;15 కు ముగుస్తుంది&period; ఆ తర్వాత ప్రత్యేకంగా క్లోజింగ్ ఆక్షన్ సెషన్ మొదలవుతుంది&period;<br &sol;>&NewLine;3&period;15 నుంచి 3&period;20 వరకు ట్రాన్సిషన్ పీరియడ్ &comma; 3&period;20 నుంచి 3&period;25 వరకు క్యాస్ ఆర్డర్ ఎంట్రీ ఉంటుంది&period;ఈ దశలో మార్కెట్ ఆర్డర్లను మార్చడానికి లేదా రద్దు చేయడానికి వీలుండదు&period; చివరి రెండు నిమిషాల్లో యాదృచ్ఛికంగా వేలం ముగుస్తుంది&period; 3&period;30 నుంచి 3&period;35 వరకు ఆర్డర్ మ్యాచింగ్ ఉంటుంది&period; ఈ సెషన్‌లో కనుగొన్న ధరనే ఆ రోజుటి అధికారిక ముగింపు ధరగా పరిగణిస్తారు&period; అయితే&comma; నాన్-F&amp&semi;O ఈక్విటీ క్యాష్ స్టాక్స్ ట్రేడింగ్ విషయంలో ఎలాంటి మార్పులు లేవని&comma; యథావిధిగా మధ్యాహ్నం 3&colon;30 గంటలకు ముగుస్తుందని సెబీ స్పష్టం చేసింది&period;<br &sol;>&NewLine;మరో కీలక మార్పుగా ఈక్విటీ డెరివేటివ్స్ సెగ్మెంట్‌లో ట్రేడింగ్ సమయాన్ని 10 నిమిషాలు పొడిగించారు&period; దీంతో ట్రేడింగ్ సాయంత్రం 3&period;40 వరకు కొనసాగుతుంది&period; అలాగే&comma; ప్రీ-ఓపెన్ సెషన్‌లో కూడా స్వల్ప మార్పులు చేశారు&period; ఉదయం 9 నుంచి 9&period;07 వరకు మాత్రమే ఆర్డర్ ఎంట్రీ విండో అందుబాటులో ఉంటుంది&period; 9&period;07 నుంచి 9&period;15 మధ్య ఆర్డర్లు మ్యాచ్ అవుతాయి&period; యథావిధిగా 9&period;15 కు రెగ్యులర్ ట్రేడింగ్ ప్రారంభమవుతుంది&period; సరైన à°§à°°à°² గుర్తింపు &comma; మార్కెట్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం&comma; లిక్విడిటీని పెంచడం&comma; పెట్టుబడిదారులందరికీ సమాన అవకాశాలు కల్పించడం&comma; పాసివ్ ఫండ్స్ ట్రాకింగ్ ఎర్రర్‌ను తగ్గించడం&comma; అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా మార్పులు తీసుకురావడం వంటి లక్ష్యాలతో ఈ సంస్కరణలు చేపట్టినట్లు సెబీ వెల్లడించింది&period; ఈ కొత్త మార్పులు భారత స్టాక్ మార్కెట్ పనితీరును మరింత మెరుగుపరుస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.