ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం హై అలెర్ట్.

Advertisements

<p>దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది&period; ఆగస్టు 15 వేడుకలు ప్రశాంతంగా&comma; ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నిర్వహించేందుకు ఢిల్లీ పోలీసులు&comma; భద్రతా సంస్థలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి&period; నగరంలోని కీలక ప్రాంతాలు&comma; ప్రభుత్వ కార్యాలయాలు&comma; మెట్రో స్టేషన్లు&comma; రైల్వే స్టేషన్లు&comma; బస్ టెర్మినల్స్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు&period; ఢిల్లీలోకి వచ్చే అన్ని ప్రధాన ప్రవేశ మార్గాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు&period; అనుమానాస్పద వ్యక్తులు&comma; వస్తువులపై నిఘా పెంచడంతో పాటు డ్రోన్లు&comma; సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది&period; అల్లర్లు&comma; ఉగ్రవాద దాడులు లేదా ఇతర అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా కేంద్ర&comma; రాష్ట్ర భద్రతా యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.