ఢిల్లీ ఐఐటీ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.

Advertisements

<p>యువతరం సామర్థ్యాలపై తమకు ఎంతో విశ్వాసం ఉందన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ&period; ఢిల్లీ ఐఐటీ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు&period; వికసిత్‌ భారత్‌ దిశగా సాగే దేశ ప్రయాణానికి యువత అవసరం ఎంతో ఉందన్నారు&period; ఏ తరం వారైనా దేశ బాధ్యతను విస్మరించొద్దని సూచించారు&period;ఐఐటీ దిల్లీ గ్రాడ్యుయేట్లను కలుసుకోవటం చాలా సంతోషంగానూ&comma; గర్వంగా ఉందన్నారు&period; వేగంగా మారుతున్న బయట ప్రపంచాన్ని కుతూహలంగా గమనించాలని సూచించారు&period; నిత్య విద్యార్థిలా సాంకేతిక రంగంలోని మార్పులను నేర్చుకోవాలన్నారు&period; రాబోయే 20-30 ఏళ్లలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని&comma; అందువల్ల జీవితంలో ఎప్పుడూ కుతూహలం కలిగి ఉండాలని మోదీ విద్యార్థులకు మార్గనిర్దేశనం చేశారు&period;<&sol;p>&NewLine;<p>జీవితంలో పెద్ద సవాలు ఎదురైనప్పుడు దాన్ని చూసి భయపడవద్దన్నారు&period; ఆ సవాలును చిన్న చిన్న భాగాలుగా విడదీసి చూస్తే పరిష్కారం దొరుకుతుందన్నారు&period; కేవలం ప్రశ్నలు అడగడంతో ఆగిపోకుండా పరిష్కారాలను కనుగొనే ధైర్యం కూడా ఉండాలని పిలుపునిచ్చారు&period; దేశాభివృద్ధి ప్రయాణంలో యువత కూడా భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు&period; వచ్చే 30-35 ఏళ్లలో మీరు ఏం చేస్తున్నారన్నదే&period;&period; వికసిత్‌ భారత్‌ను నిర్ణయిస్తుందన్నారు&period; మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా సరే&period;&period; ఈ దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆలోచించాలని సూచించారు&period;<&sol;p>&NewLine;<p>విద్య&comma; కెరీర్‌తో పాటు మానసిక&comma; శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీ విద్యార్థులకు సూచించారు&period; విజయాన్ని సాధించే క్రమంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదన్నారు&period; అలాగే గోబర్ధన్ యోజనను ప్రస్తావిస్తూ&period;&period; ఆవు పేడ&comma; వ్యవసాయ వ్యర్థాలు&comma; సేంద్రియ వ్యర్థాల నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ వంటి స్వచ్ఛమైన పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా వ్యర్థాలను సంపదగా మార్చే దిశగా భారత్ ముందుకు సాగుతోందని తెలిపారు&period; సేంద్రియ ఎరువుల వినియోగం ద్వారా నేల సారాన్ని పెంచడంతో పాటు రైతులకు కొత్త అవకాశాలు కల్పించవచ్చని అన్నారు&period; ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు దీన్‌దయాల్‌ శర్మ స్వర్ణ పతకం&comma; డైరెక్టర్‌ స్వర్ణ పతకాలను ప్రదానం చేశారు&period; పతకాలు స్వీకరించిన వారిలో ఒకరిద్దరే మహిళలు ఉన్నారని&comma; వీరి సంఖ్య ఎక్కువగా ఉంటే బాగుండేదని మోదీ అన్నారు&period; కార్యక్రమంలో భాగంగా ఐఐటీ దిల్లీ సోనిపత్‌ క్యాంపస్‌లో ఏఐ ఆధారిత సూపర్‌ కంప్యూటింగ్‌ కేంద్రమైన &OpenCurlyQuote;పరం ప్రజ్ఞ’ను ఆయన ప్రారంభించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

టీడీపీ యూనిట్ ఇంఛార్జ్‌ల కోసం శిక్షణా తరగతులు.

ఇరాన్, రష్యాపై ఆంక్షల బిల్లుకు US సెనెట్ గ్రీన్ సిగ్నల్.

తిరుపతిలో మద్యం మత్తులో లారీ డ్రైవర్ బీభత్సం.