కామన్వెల్త్‌ పతక విజేతలతో ప్రధాని మోదీ భేటీ.

Advertisements

<p>కామన్వెల్త్‌ గేమ్స్‌-2026లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు&period; గ్లాస్గో వేదికగా జరిగిన ఈ క్రీడల్లో అద్భుత ప్రదర్శన చేసిన భారత అథ్లెట్లను ప్రధాని అభినందించారు&period; వివిధ క్రీడా విభాగాల్లో రాణిస్తున్న క్రీడాకారులను దేశ ప్రజలు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు&period; క్రీడాకారులతో ప్రధాని మోదీ జరిపిన ముఖాముఖి కార్యక్రమానికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు&period; &OpenCurlyQuote;జో ఖేలేగా&comma; వో ఖిలేగా’ అంటూ యువ క్రీడాకారులను మోదీ మరోసారి ప్రోత్సహించారు&period; భారత క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహించాలని&period;&period; &OpenCurlyQuote;భారత్‌ మాతా కీ జై’ అంటూ పిలుపునిచ్చారు&period; గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌లో పలు ప్రధాన క్రీడాంశాలను తొలగించినప్పటికీ&period;&period; భారత్‌ పతకాల పట్టికలో టాప్‌-5లో నిలిచింది&period; ముఖ్యంగా బాక్సింగ్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటారు&period; బాక్సర్లు మొత్తం 10 పతకాలు సాధించగా&period;&period; అందులో 7 స్వర్ణ పతకాలు ఉన్నాయి&period; జూడోలోనూ భారత్‌కు మంచి ఫలితాలు లభించాయి&period; అస్మితా దే&comma; హర్ష్‌ సింగ్‌ స్వర్ణ పతకాలు సాధించారు&period; ఈ విభాగంలో భారత్‌ మొత్తం నాలుగు పతకాలను ఖాతాలో వేసుకుంది&period; అథ్లెటిక్స్‌లో గుల్వీర్‌ సింగ్‌ అద్భుత ప్రదర్శన చేశాడు&period; 10 వేల మీటర్ల పరుగులో రజతం&comma; 5 వేల మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించాడు&period; ఒకే కామన్వెల్త్‌ గేమ్స్‌ ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్‌గా గుల్వీర్‌ సింగ్‌ చరిత్ర సృష్టించాడు&period; పారా అథ్లెట్లు సైతం సత్తా చాటారు&period; మహిళల F57 షాట్‌పుట్‌లో శర్మిలా ధంకర్‌ స్వర్ణ పతకం సాధించి&period;&period; పారా అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి కామన్వెల్త్‌ స్వర్ణాన్ని అందించింది&period; పురుషుల 100 మీటర్ల T47 విభాగంలో దిలీప్‌ మహదు గవిట్‌ స్వర్ణ పతకం సాధించాడు&period; తదుపరి కామన్వెల్త్‌ గేమ్స్‌ భారత్‌లోని అహ్మదాబాద్‌లో జరగనున్న నేపథ్యంలో&period;&period; సొంతగడ్డపై భారత క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించే అవకాశాలున్నాయని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్