ఎయిరిండియాకు వరుస కుదుపులు.

Advertisements

<p>ఎయిరిండియాకు వరుస సమస్యలు కుదుపులు తెస్తున్నాయి&period; సాంకేతిక లోపాలు&comma; విమానాల్లో తీవ్ర టర్బులెన్స్‌&comma; సిబ్బంది వివాదాలు సంస్థపై ఒత్తిడిని పెంచుతున్నాయి&period; తాజాగా ఫుకెట్‌ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా AI2379 విమానంలో తీవ్ర టర్బులెన్స్‌ చోటుచేసుకుంది&period; విమానం ఒక్కసారిగా సుమారు 300 అడుగుల మేర కిందికి జారిపోవడంతో 12 మంది ప్రయాణికులు&comma; సిబ్బంది గాయపడినట్లు నివేదికలు వెల్లడించాయి&period;<&sol;p>&NewLine;<p>ఎయిర్ ఇండియా కుదుపుల అంశం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది&period; విమానాన్ని నడిపిన చీఫ్‌ పైలట్‌ పోస్ట్‌-ఫ్లైట్‌ స్క్రీనింగ్‌లో డోప్‌ టెస్ట్‌లో విఫలమైనట్లు ప్రాథమిక నివేదికలు వెలువడ్డాయి&period; దీనిపై డీజీసీఏ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లు సమాచారం&period; మరోవైపు ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక లోపాల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది&period; ఇంజిన్‌ వార్నింగ్‌లు&comma; హైడ్రాలిక్‌ వ్యవస్థ సమస్యలు&comma; విమాన నియంత్రణ లోపాలు&comma; ఇంధనం లేదా ఇంజిన్‌ ఆయిల్‌ లీకేజీల వంటి ఘటనలు నమోదవుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు సూచిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p>అంతర్జాతీయ సర్వీసులపైనా ఎయిరిండియాకు సవాళ్లు ఎదురయ్యాయి&period; పశ్చిమాసియా ఉద్రిక్తతలు&comma; పెరిగిన ఇంధన ధరలు&comma; విమానాల కొరత ప్రభావంతో జూన్‌ నుంచి ఆగస్టు మధ్య దాదాపు 145 అంతర్జాతీయ వీక్లీ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు సమాచారం&period; ఢిల్లీ-చికాగో&comma; ఢిల్లీ-నెవార్క్‌&comma; ముంబై-న్యూయార్క్‌ వంటి కీలక లాంగ్‌హాల్‌ మార్గాలతో పాటు యూరప్‌&comma; ఆసియా రూట్లలోనూ సర్వీసుల కోతలు చోటుచేసుకున్నాయి&period; దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు పెరిగాయి&period;<&sol;p>&NewLine;<p>అయితే సెప్టెంబర్‌ 1 నుంచి చాలా అంతర్జాతీయ సర్వీసులను తిరిగి పునరుద్ధరించే చర్యలు చేపడుతున్నట్లు సమాచారం&period; వరుస సాంకేతిక సమస్యలు&comma; టర్బులెన్స్‌ ఘటనలు&comma; విమానాల కొరత&comma; ఇంధన వ్యయాల పెరుగుదలతో ఎయిరిండియాకు సవాళ్లు కొనసాగుతున్నాయి&period; ముఖ్యంగా ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదన్న డిమాండ్లు పెరుగుతున్నాయి&period; డీజీసీఏ విచారణలో ఎలాంటి అంశాలు బయటపడతాయన్నది ఇప్పుడు కీలకంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్