ఝార్ఖండ్‌లో ఉధృతమైన పేపర్‌ లీక్‌ వ్యతిరేక ఉద్యమం.

Advertisements

<p>ఝార్ఖండ్‌లో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి&period; ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో&period;&period; విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి ర్యాలీగా బయలుదేరారు&period; పేపర్‌ లీక్‌ ఘటనపై ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాల్సిందేనంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు&period;విద్యార్థుల ర్యాలీలో పాల్గొనేందుకు ఝార్ఖండ్‌లోని వివిధ జిల్లాల నుంచి వేలాది మంది విద్యార్థులు రాజధాని రాంచీకి చేరుకున్నారు&period; ఇప్పటికే పలు దఫాలుగా విద్యార్థులు&comma; ప్రభుత్వం మధ్య చర్చలు జరిగినప్పటికీ&period;&period; సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో విద్యార్థులు మరోసారి ఆందోళన బాట పట్టారు&period; గతంలో ప్రకటించినట్టుగానే అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>పేపర్‌ లీక్‌ వ్యవహారంపై దృష్టి సారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యానల్‌ను ఏర్పాటు చేసినప్పటికీ&period;&period; ప్రభుత్వ చర్యలపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు&period; తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు&period; పరీక్షల నిర్వహణలో పారదర్శకత పాటించాలని&period;&period; పేపర్‌ లీక్‌ వ్యవహారంపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు&period;మరోవైపు విద్యార్థులు భారీ సంఖ్యలో రాంచీకి తరలిరావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది&period; ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు&period; నగరంలోని పలు కూడళ్లు&comma; ప్రధాన రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు&period; సున్నిత ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు&period;<br &sol;>&NewLine;రాంచీకి వచ్చే మార్గాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు&period; జిల్లాల సరిహద్దులతో పాటు రాష్ట్ర రహదారులపై కూడా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు&period; పెద్ద సంఖ్యలో విద్యార్థులు రాజధానికి చేరకుండా ముందస్తు చర్యలు చేపట్టారు&period; మరోవైపు రాంచీలో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించడం కూడా పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది&period;<br &sol;>&NewLine;ఒకవైపు తమ డిమాండ్ల సాధన కోసం వేలాది మంది విద్యార్థులు అసెంబ్లీ వైపు ర్యాలీగా కదులుతుండగా&period;&period; మరోవైపు వారిని నియంత్రించేందుకు పోలీసులు భారీగా మోహరించారు&period; దీంతో రాంచీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్