FCRA బిల్లుపై కేంద్రం కీలక నిర్ణయం.

Advertisements

<p>విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు పై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది&period; ఆ బిల్లును ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపించేందుకు నోట్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది&period; ప్రజలు&comma; మైనారిటీ సంస్థలు&comma; పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం FCRA బిల్లును జేపీసీకి పంపేందుకు మొగ్గు చూపింది&period; మరోవైపు ఇదే బిల్లును ప్రభుత్వం బేషరుతగా ఉపసంహరించుకోవాలని ఉభయ సభల్లో కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది&period;<&sol;p>&NewLine;<p>ఒకవేళ FCRA బిల్లును లోక్‌సభ&comma; రాజ్యసభ సభ్యులతో కూడిన జాయింట్ పార్లమెంట్ కమిటీ &lpar;JPC&rpar;కి పంపితే&period;&period; బిల్లులోని ప్రతీ నిబంధనను&comma; ముఖ్యంగా ఆస్తుల నిర్వహణ&comma; జరిమానాలకు సంబంధించిన ప్రతి చాప్టర్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది&period; అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు&comma; చట్టపరమైన నిపుణులు&comma; ధార్మిక ట్రస్టులు&comma; ప్రభుత్వ అధికారుల నుంచి లిఖితపూర్వక&comma; ప్రత్యక్ష సాక్ష్యాలను జేపీసీ సేకరించనుంది&period; కమిటీ తన సిఫార్సులతో నివేదికను రూపొందించిన తర్వాత&comma; తదుపరి పార్లమెంట్ సమావేశాల్లో సవరించిన బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p>గతంలో ప్రతిపాదించిన వక్ఫ్ సవరణ బిల్లు-2024 విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇదే విధమైన పార్లమెంటరీ మార్గాన్ని ఎంచుకుంది&period; ఆ బిల్లును కూడా చట్టంగా రూపకల్పన చేయడానికి ముందు విస్తృతమైన చర్చలు&comma; న్యాయ నిపుణుల అభిప్రాయ సేకరణ&comma; క్షుణ్ణమైన పరిశీలన కోసం జేపీసీకి పంపించారు&period; అదే తరహాలోనే ఇప్పుడు FCRA సవరణ బిల్లుపై కూడా పార్లమెంట్ సభ్యులు&comma; నిపుణుల సలహాలను స్వీకరించేందుకు జేపీసీకి నివేదించాలని ప్రభుత్వం భావిస్తోంది&period;<&sol;p>&NewLine;<p>ఇక FCRA సవరణ బిల్లులోని కొన్ని నిబంధనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ప్రతిపక్షాలు&comma; స్వచ్ఛంద సంస్థలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి&period; ముఖ్యంగా విదేశీ విరాళాల నమోదు రద్దయినా&comma; ముగిసినా&comma; స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్నా&period;&period; ఆ నిధులతో ఏర్పాటు చేసిన విద్యాసంస్థలు&comma; ఆసుపత్రులు&comma; కమ్యూనిటీ సెంటర్ల వంటి ఆస్తులను ప్రభుత్వ &OpenCurlyQuote;డెసిగ్నేటెడ్ అథారిటీ’ స్వాధీనం చేసుకునే నిబంధనపై భయాందోళనలు నెలకొన్నాయి&period; అయితే&comma; విదేశీ నిధుల ప్రవాహాన్ని నియంత్రించడం&comma; పారదర్శకతను పెంచడం&comma; జాతీయ భద్రతను కాపాడటం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని కేంద్రం చెబుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్