స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఢిల్లీలో హై అలర్ట్.

Advertisements

<p>స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు&period; ఆగస్టు 15 వేడుకలకు ముందు భద్రతా చర్యలను ఢిల్లీ పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు&period; ఇందులో భాగంగా 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల పోస్టర్లను నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు&period;ఇండియన్ ముజాహిదీన్&comma; అల్‌ఖైదా&comma; ఖలిస్థానీ సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు పేర్కొన్న వ్యక్తుల పోస్టర్లను పోలీసులు ప్రదర్శించారు&period; ఢిల్లీతో పాటు దేశ భద్రతకు ముప్పుగా భావిస్తున్న వ్యక్తులపై భద్రతా సంస్థలు&comma; ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చేయడమే ఈ పోస్టర్ల ఏర్పాటు ఉద్దేశమని పోలీసులు తెలిపారు&period;ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఢిల్లీ పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపడుతుంటారు&period; ఈసారి కూడా దేశ రాజధానిలో నిఘాను మరింత పెంచారు&period; సున్నిత ప్రాంతాలు&comma; రద్దీగా ఉండే ప్రదేశాలు&comma; కీలక ప్రభుత్వ కార్యాలయాలు&comma; ముఖ్యమైన మౌలిక వసతుల వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు&period; అనుమానాస్పద వ్యక్తులు&comma; వస్తువులు&comma; వాహనాలపై ప్రత్యేకంగా నిఘా కొనసాగుతోంది&period; స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగేలా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్