మన్మోహన్‌కు సుప్రీంకోర్టు క్లీన్‌చిట్‌పై సోనియా స్పందన.

Advertisements

<p>ఆయనను ఓ మౌనముని అంటారు&period; ఆయనకు వెన్నంటే ఓ నీడ ఉండేది&period; ఆ ముని మన్మోహన్ సింగ్ &comma; ఆ నీడ సోనియాగాంధీ&period; పదేళ్ల యూపీఏ పాలన ఇరువురు కనుసన్నల మధ్య సాగిందంటే అతిశయోక్తి కాదు&period; దశాబ్దకాలంపాటు సాగిన యూపీఏ పాలనలో ఇరువురు నేతలపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి&period; అందులో ఒకటి బొగ్గు బ్లాకుల కేటాయింపు&period; ఈ బొగ్గు కుంభకోణం ఇరువురి రాజకీయ జీవితంలో మాయన మచ్చగా నిలిచింది&period; అయితే సుప్రీంకోర్టు ఈ కుంభకోణంలో మన్మోహన్ సింగ్ కు క్లీన్ చిట్ ఇవ్వటంపై సోనియాగాంధీ స్పందించారు&period; ఈసందర్భంగా కీలక వ్యాఖ్యలు చేస్తూ ఆమె ఓ పత్రికకు వ్యాసమే రాశారు&period; మన్మోహన్ అందించిన సేవలను గుర్తుచేస్తూ&period;&period; చరిత్ర ఆయను ఎన్నటికీ గుర్తుంచుకుంటుందని వ్యాఖ్యానించారు&period;<&sol;p>&NewLine;<p>మాజీ ప్రధాని సింగ్‌ను అత్యంత ప్రభావశీలమైన ప్రధానిగా&comma; మృదుస్వభావిగా సోనియా కొనియాడారు&period; నిశ్శబ్దంగా&comma; సౌమ్యంగా ఉంటూనే దేశానికి అత్యంత కీలకమైన సేవలు అందించిన నేతగా ఆయనను అభివర్ణించారు&period;మన్మోహన్ సింగ్ నిజాయితీపై గతంలో వేసిన మచ్చలు&comma; చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని సోనియా గాంధీ పేర్కొన్నారు&period; ఆయనపై సాగిన ప్రచారం ప్రణాళికాబద్ధమైన రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు&period;&period; సుప్రీంకోర్టు తీర్పుతో నిజాలు స్పష్టమయ్యాయన్నారు&period;<&sol;p>&NewLine;<p>మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో సమాచార హక్కు చట్టం&comma; విద్యా హక్కు చట్టం&comma; మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి కీలకమైనవి అమలులోకి వచ్చాయని సోనియా గుర్తుచేశారు&period; భారత్–అమెరికా అణు ఒప్పందం ద్వారా దేశ ప్రతిష్ఠను ప్రపంచ స్థాయిలో మరింత పెంచారని పేర్కొన్నారు&period;మన్మోహన్ సింగ్‌పై జరిగిన విమర్శలు&comma; ఆరోపణలకు కాలమే సమాధానం చెబుతుందని&period;&period; చరిత్ర మాత్రం ఆయనను గొప్ప ప్రధానిగా గుర్తుంచుకుంటుందని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు&period; సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మన్మోహన్ సింగ్ వారసత్వాన్ని గుర్తుచేస్తూ సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్