NEET రద్దుకు తమిళనాడు అసెంబ్లీ తీర్మానం.

Advertisements

<p>నీట్ రద్దు చేయాలంటూ తమిళనాడు అసెంబ్లీ మరోసారి గళమెత్తింది&period; దేశవ్యాప్తంగా NEETను రద్దు చేయాలని కోరుతూ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది&period;12à°µ తరగతి మార్కుల ఆధారంగా వైద్య సీట్ల భర్తీకి అవకాశం కల్పించాలని కేంద్రాన్ని కోరింది&period; అయితే తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యే సభ నుంచి వాకౌట్ చేశారు&period;<&sol;p>&NewLine;<p>తమిళనాడులో NEETపై మరోసారి రాజకీయ పోరు మొదలైంది&period; దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న NEETను పూర్తిగా రద్దు చేయాలంటూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది&period; టీవీకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి పలు ప్రధాన పార్టీలు మద్దతు తెలిపాయి&period; NEET కారణంగా గ్రామీణ&comma; పేద&comma; వెనుకబడిన వర్గాల విద్యార్థులు నష్టపోతున్నారని ప్రభుత్వం ఆరోపించింది&period;<&sol;p>&NewLine;<p>నీట్ కు బదులుగా 12à°µ తరగతి బోర్డు పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా వైద్య కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించే విధానాన్ని పునరుద్ధరించాలని తమిళనాడు ప్రభుత్వం డిమాండ్ చేసింది&period; ఖరీదైన కోచింగ్ సెంటర్లపై ఆధారపడాల్సి రావడం వల్ల పేద&comma; గ్రామీణ విద్యార్థులకు సమాన అవకాశాలు దెబ్బతింటున్నాయని పేర్కొంది&period; పేపర్ లీకేజీలు&comma; పరీక్షలపై నమ్మకం కోల్పోయే ఘటనలు కూడా NEET వ్యవస్థపై ఆందోళనలను పెంచాయని ప్రభుత్వం తెలిపింది&period;<&sol;p>&NewLine;<p>వైద్య విద్యలో రాష్ట్రాల హక్కులను తిరిగి కల్పించాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది&period; తీర్మానానికి డీఎంకే&comma; ఏఐఏడీఎంకే&comma; కాంగ్రెస్ సహా పలు పార్టీలు మద్దతు ఇవ్వగా&comma; బీజేపీ ఎమ్మెల్యే మాత్రం వ్యతిరేకిస్తూ వాకౌట్ చేశారు&period; దీంతో NEET రద్దు అంశం మరోసారి కేంద్రం–రాష్ట్రాల మధ్య రాజకీయ&comma; విద్యా విధాన చర్చకు కేంద్రంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్