అత్యల్ప ఉత్పాదకతతో ముగిసిన లోక్‌సభ వర్షాకాల సమావేశాలు.

Advertisements

<p>లోక్‌సభ వర్షాకాల సమావేశాలు ఈసారి అత్యంత తక్కువ ఉత్పాదకతతో ముగిశాయి&period; నిర్ణయించిన మొత్తం సమయంతో పోలిస్తే లోక్‌సభలో కేవలం 15 శాతం మాత్రమే కార్యకలాపాలు జరిగాయని PRS లెజిస్లేటివ్ రీసెర్చ్ గణాంకాలు వెల్లడించాయి&period; గత రెండు దశాబ్దాల్లో అత్యల్ప ఉత్పాదకత నమోదైన లోక్‌సభ సమావేశాల్లో ఇది ఒకటిగా నిలిచింది&period;2004 నుంచి ఇప్పటి వరకు పరిశీలిస్తే&period;&period; దీనికంటే తక్కువ ఉత్పాదకత కేవలం రెండు సమావేశాల్లో మాత్రమే నమోదైంది&period; 2010 శీతాకాల సమావేశాల్లో లోక్‌సభ కేవలం 5 శాతం సమయం పనిచేయగా&period;&period; 2013 శీతాకాల సమావేశాల్లో 8 శాతం మాత్రమే కార్యకలాపాలు జరిగాయి&period;ఇక రాజ్యసభ నిర్ణయించిన సమయానికి 33 శాతం మాత్రమే పనిచేసినట్లు PRS గణాంకాలు చెబుతున్నాయి&period; అయితే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు వెల్లడించిన వివరాల్లో మాత్రం భిన్నమైన గణాంకాలు ఉన్నాయి&period; ఆయన ప్రకారం లోక్‌సభ 19 శాతం&comma; రాజ్యసభ 39 శాతం సమయం పనిచేసింది&period;వర్షాకాల సమావేశాల సందర్భంగా పదేపదే రాజకీయ ఘర్షణలు&comma; ప్రతిపక్షాల నిరసనలు&comma; సభలో చోటుచేసుకున్న అంతరాయాలు చట్టసభ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపాయి&period; దీంతో ప్రజా సమస్యలు&comma; కీలక అంశాలు&comma; చట్టసభ వ్యవహారాలకు కేటాయించిన సమయం గణనీయంగా తగ్గిపోయింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింహాచలంలో వైభవంగా శ్రావణ శుక్రవారం పూజలు.

బాలానగర్‌లో గంజాయి ముఠాపై తెలంగాణ ఈగల్ భారీ ఆపరేషన్.

మహబూబ్ నగర్ భూత్పూర్ వద్ద రోడ్డు ప్రమాదం.