పోలీస్ స్టేషన్‌ ముందు రాహుల్ గాంధీ ధర్నా.

Advertisements

<p>పెల్లెట్ గన్ గాయాల వ్యవహారంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ&comma; లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఢిల్లీలో ఆందోళనకు దిగారు&period; జులై 20à°¨ జరిగిన జెన్‌-జీ విద్యార్థుల నిరసనల్లో పెల్లెట్ గన్ గాయాలయ్యాయని ఆరోపిస్తున్న సాహిల్ లోచాబ్‌ను వెంటబెట్టుకుని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు&period; అనంతరం సీనియర్ పోలీస్ అధికారి కార్యాలయం బయట బాధితుడితో కలిసి ధర్నాకు కూర్చున్నారు&period; జులై 20à°¨ పరీక్షల పేపర్ లీక్‌లకు నిరసనగా వందలాది మంది విద్యార్థులు పార్లమెంట్ వైపు మార్చ్ చేపట్టిన విషయం తెలిసిందే&period; ఆ సమయంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి&period; ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది పెల్లెట్ గన్స్ ఉపయోగించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది&period; ఈ ఘటనలో గాయపడినట్లు పలువురు నిరసనకారులు చెప్పడంతో పాటు వైద్య నివేదికలు కూడా ఉన్నాయని కాంగ్రెస్ పేర్కొంది&period; అయితే జులై 20à°¨ పెల్లెట్ గన్స్ ఉపయోగించలేదని ఢిల్లీ పోలీసులు పలుసార్లు తెలిపారు&period; ఈ అంశంపై సీఆర్‌పీఎఫ్‌ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు&period; మరోవైపు&comma; గాయపడిన నిరసనకారుల వాంగ్మూలాలు&comma; వైద్య నివేదికలు పెల్లెట్ గన్స్ వాడలేదన్న వాదనపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని కాంగ్రెస్‌ పేర్కొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న 22-A వివాదం!

ప.గో.జిల్లా భీమవరంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం.

అంతరిక్ష రంగంలో అమెరికా భారీ టార్గెట్.