తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే వర్సెస్ టీవీకే.

Advertisements

<p>తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ప్రభుత్వ కార్ల కేటాయింపు అంశం రాజకీయ దుమారానికి దారితీసింది&period; ఈ విషయంలో అధికార టీవీకే&comma; డీఎంకే సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది&period; ఎమ్మెల్యేలకు కార్లు కేటాయించే ముందు వారి ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్న ఆస్తుల వివరాలను పరిశీలించాలని డీఎంకే సభ్యులు సూచించారు&period; ఇప్పటికే సొంతంగా వాహనాలు కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత ఉన్నవారికి ప్రభుత్వ కార్లు ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు&period; తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఉచిత ప్రభుత్వ కార్లు అవసరం లేదని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు&period; దీనికి ప్రతిగా టీవీకే సభ్యులు ఉదయనిధి స్టాలిన్‌కు మూడు ఇళ్లు ఉన్నాయని పేర్కొంటూ విమర్శలు గుప్పించారు&period; ప్రభుత్వ కార్ల అంశంపై ఇరు పార్టీల మధ్య జరిగిన మాటల యుద్ధంతో అసెంబ్లీలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది&period; ఈ వ్యవహారం ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న 22-A వివాదం!

ప.గో.జిల్లా భీమవరంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం.

అంతరిక్ష రంగంలో అమెరికా భారీ టార్గెట్.