ఎల్ఈడీ లైట్లతో నరకప్రాయంగా రాత్రి ప్రయాణం..

Advertisements

<p>రాత్రి వేళ రోడ్లపై ప్రయాణం ఇప్పుడు ప్రజలకు భయానక అనుభవంగా మారుతోంది&period; ఎదురుగా వచ్చే వాహనాల ఎల్ఈడీ హెడ్‌లైట్ల కాంతి డ్రైవర్ల కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది&period; ముఖ్యంగా హైవేలపై&comma; గ్రామీణ రహదారులపై ఈ సమస్య మరింత ప్రమాదకరంగా మారింది&period; ఒక్కసారిగా కళ్ల ముందు తెల్లటి వెలుగు పడటంతో కొన్ని క్షణాలు ఏమీ కనిపించకపోవడం&comma; అదే సమయంలో ప్రమాదాలు జరగడం సాధారణమవుతోంది&period; గతంలో హెడ్‌లైట్లకు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ లేదా బ్లాక్ పెయింట్ తప్పనిసరి అన్న నిబంధన అమల్లో ఉండేది&period; ఇప్పుడు ఆ నిబంధన అమలులో ఉందో లేదో కూడా చాలామందికి తెలియని పరిస్థితి&period; మరోవైపు కంపెనీ ఫిట్‌మెంట్ కాకుండా మార్కెట్‌లో దొరికే హై పవర్ LEDలు&comma; ప్రొజెక్టర్ లైట్లు వాహనాలకు అమర్చడం పెరిగిపోయింది&period; ఆర్టీవో&comma; ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేయకపోవడంతో నియంత్రణ పూర్తిగా సడలిపోయిందని ప్రజలు విమర్శిస్తున్నారు&period; రాత్రి 7 గంటల తర్వాత వాహనం నడపాలంటేనే భయమేస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>భారత మోటార్ వెహికిల్స్ చట్టం ప్రకారం హెడ్‌లైట్ల వినియోగంపై ఇప్పటికే స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి&period; లో-బీమ్‌కు 55 వాట్స్&comma; హై-బీమ్‌కు గరిష్టంగా 60 నుంచి 70 వాట్స్ వరకు మాత్రమే అనుమతి ఉంది&period; కానీ మార్కెట్‌లో 100 వాట్స్ పైగా కాంతి ఇచ్చే బల్బులు విస్తృతంగా అమ్ముడవుతున్నాయి&period; కంపెనీ ఇచ్చిన సాధారణ లైట్ల స్థానంలో అధిక కాంతి ఇచ్చే LEDలు అమర్చడం చట్టవిరుద్ధం అయినా ఎక్కడా నియంత్రణ కనిపించడం లేదు&period; సుప్రీంకోర్టు కూడా ఇతరులకు కళ్లు మిరుమిట్లు గొలిపే లైట్లు ప్రమాదకరమని స్పష్టం చేసింది&period; నగరాల్లో&comma; స్ట్రీట్ లైట్లు ఉన్న ప్రాంతాల్లో తప్పనిసరిగా డిమ్ లైట్ వాడాలనే నిబంధన ఉన్నా చాలామంది డ్రైవర్లు హైబీమ్‌ను ఆఫ్ చేయడం లేదు&period; ఫలితంగా ఎదురుగా వచ్చే వాహనదారులు క్షణాల్లో విజిబిలిటీ కోల్పోతున్నారు&period; ఇది చిన్న ప్రమాదాలకే కాదు ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమవుతోంది&period; అధికారులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి అక్రమ LEDలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>రోడ్డు భద్రతలో హెడ్‌లైట్ల నియంత్రణ అత్యంత కీలకమైన అంశంగా నిపుణులు చెబుతున్నారు&period; వాహనానికి గరిష్టంగా నాలుగు లైట్లు మాత్రమే ఉండాలనే నిబంధన ఉన్నా కొందరు అదనపు ఫాగ్ లైట్లు&comma; LED బార్లు అమర్చి రోడ్లపై తిరుగుతున్నారు&period; తెలుపు లేదా పసుపు రంగు లైట్లు మాత్రమే అనుమతించబడినా బ్లూ&comma; వైట్ ఫ్లాషింగ్ లైట్లు కూడా కనిపిస్తున్నాయి&period; ఇవి ఇతర డ్రైవర్ల దృష్టిని మరింత దెబ్బతీస్తున్నాయి&period; రాత్రి సమయంలో కొన్ని క్షణాల విజిబిలిటీ కోల్పోవడమే భారీ ప్రమాదాలకు కారణమవుతుందని ట్రాఫిక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు&period; ముఖ్యంగా వృద్ధులు&comma; కంటి సమస్యలు ఉన్నవారికి ఈ LED కాంతి మరింత ప్రమాదకరంగా మారుతోంది&period; నిబంధనలు ఉల్లంఘిస్తే రూ&period;500 నుంచి రూ&period;1&comma;000 వరకు జరిమానాలు&comma; మళ్లీ తప్పు చేస్తే మరింత భారీ ఫైన్ విధించే అవకాశం ఉంది&period;నిబంధనలు అమలు చేయడంలో అధికారుల అలసత్వాన్ని కొందరు వాహన దారులు అవకాశంగా తీసుకుంటున్నారు &period;దింతో పరిస్థితి అదుపు తప్పుతోంది&period; కనీసం పాత నిబంధనల మాదిరిగా హెడ్‌లైట్లపై బ్లాక్ స్టిక్కర్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని&comma; అక్రమ LEDలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..