వెనుకబడి తరగతుల్లోని ధనవంతులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..

వెనుకబడి తరగతుల్లోని ధనవంతులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Advertisements

<p>వెనుకబడి తరగతుల్లోని ధనవంతులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది&period; వెనుకబడిన కులాల్లో పుట్టినప్పటికీ ఆర్థికంగా &comma; విద్యాపరంగా&comma; వృత్తి పరంగా ఉన్నత స్థానాల్లో ఉన్న కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్ ప్రయోజనాలు ఎందుకని ప్రశ్నించింది&period; ఇది సహేతుకంగా ఉన్నప్పటికీ&period;&period;ఐఏఎస్ à°² కుటుంబాలను మాత్రమే ఉదాహరణగా చూపించింది&period; క్రీమీ లేయర్ దాఖలైన పిటిషన్ ను జస్టిస్ బి&period;వి&period; నాగరత్న&comma; జస్టిస్ ఉజ్జల్ భుయాన్ లతో కూడిన ధర్మాసనం విచారించింది&period;&period;రిజర్వేషన్ల ద్వారా సామాజిక ఆర్థిక సమానతలు పెరుగుతాయనీ&&num;8230&semi;అలాంటి వారి పిల్లల రిజర్వేషన్లు కొనసాగించడం సరికాదని&period;&period;ఇది ఆలోచించాల్సిన విషయమని అభిప్రాయపడింది&period; కోటాల ద్వారా సామాజికంగా ఉన్నతస్థాయికి చేరుకున్న కుటుంబాలు ఇకనైనా రిజర్వేషన్ల నుంచి బయటకు రావాలని కోర్టు సూచించింది&period;<br &sol;>&NewLine;పేరెంట్స్ ఐఏఎస్ ఆఫీసర్లంటే&period;&period; ఇద్దరూ ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారే&period; వారికి సమాజంలో పురోగతి&comma; అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది&period; విద్యా&comma; ఆర్థిక సాధికారతతో సామాజిక పురోగతి సాధ్యమవుతుందని&comma; ఆ తర్వాత కూడా వారి పిల్లలకు రిజర్వేషన్లు కోరుకుంటే&comma; మనం ఈ వ్యవస్థ నుండి ఎప్పటికీ బయటపడలేమని పేర్కొన్న ధర్మాసనం&period;&period;&comma; ఇది తీవ్రంగా ఆలోచించాల్సిన విషయమని అభిప్రాయపడింది&period; సదరు వ్యక్తులను వారి జీతం ఆధారంగా కాకుండా &period;&period;వారి హోదా ఆధారంగా మినహాయించారని&comma; దీనిపై లోతైన పరిశీలన అవసరమని పిటిషనర్ల తరఫు న్యాయవాది శశాంక్ రత్నూ కోరారు&period; ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి&comma; క్రీమీ లేయర్‌కు మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉండాలన్నారు&period; EWS కేటగిరీలో సామాజిక వెనుకబాటుతనం ఉండదని&comma; కేవలం ఆర్థిక వెనుకబాటుతనం మాత్రమే ఉంటుందని జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు&period; అయితే&period;&period; క్రీమీ లేయర్ ప్రమాణాలు EWS కంటే చాలా సరళంగా ఉండాలని&comma; లేకపోతే రెండింటికీ తేడా ఉండదని న్యాయవాది వాదించారు&period; వ్యవస్థలో కొంత సమతుల్యత ఉండాలని&comma; రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొంది తల్లిదండ్రులు ఒక ఉన్నత స్థాయికి చేరుకున్నా తర్వాత పరిస్థితులు మారుతాయని పేర్కొన్నారు&period;ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం సుప్రీంకోర్టు సంబంధిత పక్షాలకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి సమాధానాలను కోరింది&period;<br &sol;>&NewLine;వెనుకబడిన తరగతులలోని క్రీమీ లేయర్‌కు రిజర్వేషన్ ప్రయోజనాలపై దాఖలైన పిటిషన్లను పరిశీలిస్తున్న న్యాయస్థానం&period;&period; కుల ఆధారిత సామాజిక వెనుకబాటుతనాన్ని ఆర్థిక హోదా అధిగమించగలదా అనే అంశాన్ని తిరిగి సమీక్షిస్తోంది&period; 1992 నాటి చారిత్రాత్మక &&num;8216&semi;ఇంద్ర సాహ్ని&&num;8217&semi; &lpar;మండల్ కేసు&rpar; తీర్పులో సుప్రీంకోర్టు ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లను సమర్థిస్తూనే&comma; వారిలోని &&num;8216&semi;క్రీమీ లేయర్&&num;8217&semi; వర్గాలను కోటాల నుండి మినహాయించాలని స్పష్టం చేసింది&period; ప్రస్తుత నిబంధనల ప్రకారం రూ&period;8 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న ఓబీసీ కుటుంబాలను క్రీమీ లేయర్‌గా పరిగణిస్తారు&period; అలాగే ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు&comma; సీనియర్ బ్యూరోక్రాట్లు&comma; మిలిటరీ ఉన్నతాధికారుల పిల్లలకు ఆదాయంతో సంబంధం లేకుండా మినహాయింపు వర్తిస్తుంది&period; కాగా&comma; తల్లిదండ్రుల ఉద్యోగ హోదా&comma; కేటగిరీని కూడా పరిగణనలోకి తీసుకోవాలని&comma; కేవలం ఆదాయమే క్రీమీ లేయర్ మినహాయింపుకు ఏకైక ప్రమాణం కాబోదని&&num;8230&semi; ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పులో స్పష్టం చేసింది&period; తల్లిదండ్రులు ఉన్నతస్థాయికి చేరుకుంటే&&num;8230&semi;వారి పిల్లలకు రిజర్వేషన్లు అవసరమా&quest; అని ప్రశ్నిచింది&period; ఎలాంటి ఆర్థిక స్తోమత&period;&period;ఉన్నత ఉద్యోగాలు లేని వారి పిల్లలు ఎప్పటికీ వెనుకబాటు తనాన్ని అనుభవించాల్సి వస్తోందనే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తంచేసింది&period;<br &sol;>&NewLine;కాగా రిజర్వేషన్లపై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి&period; బీసీల్లోనే కాదు&&num;8230&semi;ఓబీసీల్లోనూ&comma; ఎస్సీ&comma; ఎస్టీల్లోనూ ఉన్నత ఉద్యోగాలు&comma; ఉన్నత పదవులు అనుభవిస్తున్నవాళ్ల పిల్లలు కూడా ఇంకా ఆయా రిజర్వేషన్ల నుంచి బయటపడడం లేదు&period; ఐఏఎస్&comma; ఐపీఎస్&period;&period;రాజ్యాంగ పదవులు లేదా ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తున్న వాళ్ల పిల్లలు కూడా ఇంకా రిజర్వేషన్ సౌకర్యాన్ని ఆశిస్తున్నారు&period; ఇలా అన్ని సామాజిక వర్గాలు అనుభవిస్తున్న రిజర్వేషన్లను&period;&period;మరోసారి ఆలోచించాల్సిన అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు&period; ఏ రిజర్వేషన్ కైనా ఆర్థిక&comma;సామాజిక వాస్తవ స్థితిగతులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు చెప్పడాన్ని స్వాగతిస్తున్నారు&period; బీసీ వర్గాల నుంచి రాజకీయ పదవులు అనుభవిస్తున్న నాయకులు లేదా ఉన్నత పదవుల్లో ఉన్న బీసీ ధనవంతుల పిల్లలకు రిజర్వేషన్ల ప్రస్తావన తేకపోడం కొంత గందరగోళానికి ఆస్కారమిచ్చిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు&period;&period; ఏ వర్గంలోనైనా ధనవంతుల పిల్లలు రిజర్వేషన్ సౌకర్యాన్ని&comma; ప్రయోజనాలు పొందడంపై మరోసారి లోతైన చర్చకు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు దోహదం చేస్తాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సంక్షోభంలో 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సింగరేణి..

యూపీలో ఏపీ పర్యాటకుల బస్సుకు ప్రమాదం..

సింగపూర్‌లో మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసులు..