జూన్ 1న ఇందిరమ్మ ఇళ్లు రెండో విడత ప్రారంభం..

జూన్ 1న ఇందిరమ్మ ఇళ్లు రెండో విడత ప్రారంభం -పొంగులేటి

Advertisements

<p>తెలంగాణలో పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది&period; జూన్ 1 నుంచి ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది&period; ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వెల్లడించారు&period; రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి రెండు వేల ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు&period; ఇప్పటికే స్థలాలు ఉన్న 1&comma;500 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ&period;5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించారు&period; రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 14&comma;800 పూరిగుడిసెల కుటుంబాలకు కూడా రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు&period; ఇళ్ల స్థలాలు ఉన్న మరో 18&comma;500 మందికి రూ&period;5 లక్షల చొప్పున నేరుగా అందించనున్నట్లు తెలిపారు&period; రాష్ట్రంలో లక్ష ఇళ్లు నిర్మించి పేదలకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు&period; క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇప్పటికే 7 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం ఈ పథకంపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని చూపిస్తోందన్నారు&period; కేబినెట్ సమావేశంలో గృహ నిర్మాణంతో పాటు రైతు సంక్షేమం&comma; ఉద్యోగాల భర్తీ&comma; తాగునీటి ప్రాజెక్టులు&comma; విద్యుత్ సరఫరా&comma; మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది&period; రాష్ట్ర అభివృద్ధి&comma; సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని మంత్రులు పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..

అన్నమయ్య జిల్లా అరవీడులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..