పశ్చిమ బెంగాల్‌లోని ఫాల్టాలో రీపోలింగ్..

పశ్చిమ బెంగాల్‌లోని ఫాల్టాలో రీపోలింగ్

Advertisements

<p>పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా పరిధిలోకి వచ్చే ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గ రీ-పోలింగ్ ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ అసాధారణ రీతిలో భారీ విజయాన్ని నమోదు చేసింది&period; ఈ ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి దేబాంగ్షు పాండా తన సమీప ప్రత్యర్థిపై ఏకంగా 1&comma;09&comma;021 ఓట్ల రికార్డు మెజారిటీతో ఘనవిజయం సాధించారు&period; మొత్తం 22 రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థికి 1&comma;49&comma;666 ఓట్లు రాగా&comma; రెండో స్థానంలో నిలిచిన సీపీఐ&lpar;ఎం&rpar; అభ్యర్థి శంభునాథ్ కుర్మీకి 40&comma;645 ఓట్లు లభించాయి&period; కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుర్ రజాక్ మొల్లా 10&comma;084 ఓట్లతో మూడో స్థానంలో నిలవగా&comma; అధికార తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ కేవలం 7&comma;783 ఓట్లతో నాలుగో స్థానానికి పడిపోయి డిపాజిట్ కోల్పోవడం గమనార్హం&period; 1998లో టీఎంసీ పార్టీ స్థాపించిన తర్వాత ఆ పార్టీ అభ్యర్థి ఒకరు నాల్గో స్థానానికి పడిపోవడం&comma; అలాగే 2011 తర్వాత తొలిసారి డిపాజిట్ కోల్పోవడం ఇదే మొదటిసారి కావడంతో ఈ ఫలితం బెంగాల్ రాజకీయాల్లో సంచలనంగా మారింది&period;<&sol;p>&NewLine;<p>ఈ నియోజకవర్గానికి ఏప్రిల్ 29à°¨ జరిగిన సాధారణ పోలింగ్ సమయంలో ఈవీఎంల ట్యాంపరింగ్&comma; వెబ్-కెమెరా ఫుటేజ్ మార్పులు&comma; బూత్ క్యాప్చరింగ్ వంటి తీవ్రమైన అక్రమాలు జరిగినట్లు ప్రతిపక్షాల నుండి భారీగా ఫిర్యాదులు వచ్చాయి&period; దీనిపై విచారణ జరిపిన భారత ఎన్నికల సంఘం ఫాల్టా నియోజకవర్గంలోని మొత్తం 285 పోలింగ్ బూత్‌లలో ఎన్నికలను రద్దు చేసి&comma; మే 21à°¨ పూర్తి స్థాయిలో రీ-పోలింగ్ నిర్వహించింది&period; కేంద్ర బలగాల గట్టి నిఘా నీడలో జరిగిన ఈ రీ-పోలింగ్‌లో దాదాపు 87 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది&period; గతంలో ఈ ఫల్తా సెగ్మెంట్ నుంచి డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి భారీ ఆధిక్యత లభించేదని&comma; అయితే తాజా ఫలితంతో ఆ &&num;8220&semi;డైమండ్ హార్బర్ మోడల్&&num;8221&semi; కు పూర్తిగా తెరపడిందని ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు&period; ఈ విజయంతో 294 మంది సభ్యులున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ బలం 208 సీట్లకు చేరుకుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అన్నమయ్య జిల్లా అరవీడులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..

గ్రేటర్ హైదరాబాద్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు..