అడవుల్లో బయటపడ్డ మావోయిస్టుల ఆయుధ కర్మాగారం ..

అడవుల్లో బయటపడ్డ మావోయిస్టుల ఆయుధ కర్మాగారం

Advertisements

<p>మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో నక్సలిజం నిర్మూలన దిశగా భద్రతా దళాలు మరో భారీ విజయాన్ని అందుకున్నాయి&period; మావోయిస్టులు రహస్యంగా నిర్వహిస్తున్న ఒక ఆయుధ తయారీ కర్మాగారాన్ని గడ్చిరోలి పోలీసులు విజయవంతంగా ధ్వంసం చేశారు&period; లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ సాగింది&period; ఇటీవల &OpenCurlyQuote;ఆపరేషన్ అంతిమ ప్రహార్’ కింద కొందరు మావోయిస్టులు గడ్చిరోలి పోలీసుల ముందు లొంగిపోయారు&period; వారిని పోలీసులు లోతుగా విచారించగా&comma; అటవీ ప్రాంతంలో భారీగా ఆయుధాలు&comma; పేలుడు పదార్థాల తయారీ సామగ్రిని భూమిలో పాతిపెట్టినట్లు వెల్లడించారు&period; ఈ సమాచారంతో గడ్చిరోలి పోలీస్ సూపరింటెండెంట్ ఎం&period; రమేష్ మార్గదర్శకత్వంలో ప్రత్యేక ఆపరేషన్ బృందాలు రంగంలోకి దిగాయి&period; గడ్చిరోలి&comma; ప్రాణహిత సంయుక్త బృందాలు&comma; బాంబు డిస్పోజల్ స్క్వాడ్ కలసి అడవిని జల్లెడ పట్టాయి&period; పోమ్కేం బినాగుండా ఉత్తర అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టగా&comma; భూమిలో దాచిన భారీ ఆయుధ కర్మాగారం బయటపడింది&period; భద్రతా దళాలకు హాని కలిగించేందుకు&comma; నక్సల్ వారోత్సవాలు&comma; ఎన్నికల సమయంలో విరుచుకుపడేందుకు మావోయిస్టులు వీటిని దాచినట్లు సమాచారం&period; అయితే&comma; ప్రమాదకరమైన ఈ సామగ్రి మొత్తాన్ని జవాన్లు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఘటనా స్థలంలోనే పూర్తిగా ధ్వంసం చేశారు&period; గడ్చిరోలి జిల్లాలో మావోయిజం ఇప్పుడు దాదాపు అంతమైపోయిందని&comma; అడవుల్లో దాచిన సామగ్రిని వెలికితీయడం పోలీసు దళం సాధించిన పెద్ద విజయమని ఉన్నతాధికారులు తెలిపారు&period; ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన భద్రతా దళాలను అభినందించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..