కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్..

కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్

Advertisements

<p>కర్ణాటకలో సీఎం పీఠం మార్పునకు రంగం సిద్ధమైంది&period; కర్ణాటక సీఎల్పీ నేతగా&period;&period; డీకే శివకుమార్ పేరును సిద్ధరామయ్య ప్రతిపాదించగా&period;&period; ఆ ప్రతిపాదనను పరమేశ్వర బలపరిచారు&period; అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు డీకే శివకుమార్‌కు మద్దతు తెలపడంతో ఆయనే సీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు&period; దీంతో&period;&period; కొత్త సీఎంగా ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జూన్ 3à°¨ ప్రమాణ స్వీకారం చేయనున్నారు&period; ఈ మేరకు కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ అధికారికంగా ప్రకటించారు&period;<&sol;p>&NewLine;<p>ఇటీవలే ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయడంతో&comma; అధిష్ఠానం ఆదేశాల మేరకు డీకే శివకుమార్ బాధ్యతలను చేపట్టబోతున్నారు&period; బెంగళూరులోని లోక్‌భవన్‌లో ఉన్న గ్లాస్ హౌస్‌లో జూన్ 3à°µ తేదీన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత నిరాడంబరంగా జరగనుంది&period; మొదట రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తల కోసం భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించినప్పటికీ&comma; నగరంలో ట్రాఫిక్ సమస్యలు&comma; ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p>డీకే శివకుమార్‌తో పాటు మరికొందరు మంత్రులు కూడా అదే రోజున ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం&period; ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ&comma; మల్లిఖార్జున్ ఖర్గే&comma; ప్రియాంక గాంధీతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి&comma; కేరళం సీఎం సతీశన్&comma; సహా కాంగ్రెస్ పెద్దలు హాజరు కానున్నారు&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..